MAA Elections 2021: ‘గొడవలే.. హత్యలు, అత్యాచారాలు ఏం జరగడం లేదు’

10 Oct, 2021 12:59 IST|Sakshi

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రం వద్ద జరుగుతున్న గొడవలపై విలేకరులు ప్రశ్నించగా దీనిపై బండ్ల ఆసక్తికర రీతిలో స్పందించారు. ఈ మేరకు బండ్ల గణేశ్‌ సమాధానం ఇస్తూ.. గొడవలే కదా హత్యలు, అత్యాచారాలు ఏమి జరగడం లేదు కదా అని సమాధానం ఇచ్చాడు. అనంతరం తాను ఓటు వేసిన సభ్యులే గెలుస్తారని, తప్పకుండా ఎవరో ఒకరూ గెలుస్తారంటూ చమత్కరించాడు. 

మరిన్ని వార్తలు