యూట్యూబ్‌లో సత్తా చాటుతున్న ‘మజిలీ’ హిందీ వెర్షన్‌

17 Jun, 2021 22:13 IST|Sakshi

పెళ్లి తర్వాత సమంత-నాగచైతన్య జంటగా నటించిన తొలి చిత్రం ‘మజిలీ’. రీయల్‌ లైఫ్‌లోనే కాకుండా రీల్‌ లైఫ్‌లో కూడా చైతూ- సామ్‌లు కపుల్స్‌గా కనిపించిన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. శివ‌నిర్వాణ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద 40 కోట్ల‌ రూపాయలకు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 2019లో భారీ హిట్‌గా నిలిచిన ‘మ‌జిలీ’ మూవీ తాజాగా మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. కాగా ఈ చిత్రం హిందీలో డబ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ డబ్బింగ్ వెర్ష‌న్‌కు యూట్యూబ్ ఛాన‌ల్‌లో అద్భుత‌మైన రెస్పాన్స్‌ వస్తోంది. 

యూట్యూబ్‌లో ఈ హిందీ వెర్షన్‌ 100 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతూ ప్రస్తుతం ట్రెండ్ంగ్‌ జాబితాలో చేరింది. ఓ తెలుగు హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌కు ఈ స్థాయిల రెస్పాన్స్‌ రావడం అంటే సాధారణ విషయం కాదు. కాగా ఇటీవల సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌’ సీరిస్‌ ఓటీటీ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య అమిర్‌ ఖాన్‌ తాజా చిత్రం ‘లాల్‌ సింగ్‌ చధా’తో త్వ‌ర‌లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉండ‌గా కోవిడ్ సెకండ్ వేవ్ తో ఆల‌స్య‌మైంది. మ‌రోవైపు నాగ‌చైత‌న్య న‌టించిన ‘ల‌వ్ స్టోరీ’ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

చదవండి: 
సమంత కలర్‌పై విమర్శిస్తారని తెలుసు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు