ఉన్నికృష్ణన్‌ ప్రయాణం

18 Dec, 2020 00:31 IST|Sakshi

‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి విలక్షణమైన హిట్‌ చిత్రాల్లో నటించి, హీరోగా అడివి శేష్‌ చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన టైటిల్‌ రోల్‌లో మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తాజా ప్యాన్‌ ఇండియా మూవీ ‘మేజర్‌’. శేష్‌ బర్త్‌డే సందర్భంగా గురువారం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆర్మీ ఆఫీసర్‌ సందీప్‌ ఉన్నికష్ణన్‌ జర్నీని, ఆయన జీవన శైలిని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శశికిరణ్‌ తిక్క. ఇప్పటివరకు 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సహకారంతో సోనీ పిక్చర్స్‌ ఇండియా నిర్మిస్తోంది. వచ్చే సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల కానుంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాశ్‌ రాజ్, సయీ మంజ్రేకర్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు