‘ఆ సమయంలో నా బలం, ధైర్యం మీరే’

14 Sep, 2020 18:14 IST|Sakshi

ముంబై: ఇటీవల కరోనా బారిన పడిన నటి మలైకా అరోరా ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు అర్హాన్, పెంపుడు కుక్క కాస్పర్ ఫోటోను షేర్‌ చేస్తూ.. క్వారంటైన్‌లో వారిని మిస్సవుతున్నానంటూ భావోద్యేగానికి లోనయ్యారు. గోడకు అవతలవైపు నుంచి అర్హాన్, కాస్పర్ మలైకాను చూస్తున్న ఈ ఫొటోను సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. కష్టకాలంలో నాకు ధైర్యం, శక్తిని ఇచ్చేది తన ఇద్దరూ పిల్లలు వీరేనని పేర్కొన్నారు. ‘ప్రేమకు హద్దులు లేవు. ఈ భౌతిక దూరం, స్వీయ నిర్బంధంలో మేము ఒకరినొకరు చూసుకోవడానికి, మాట్లాడటానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాము. నా పిల్లలను ఇంకా కొన్ని రోజులు కౌగిలించుకోలేనన్న ఆలోచన నన్ను తీవ్రంగా బాధిస్తోంది. మీరే నా ధైర్యం, బలం’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. (చదవండి: లవ్‌ బర్డ్స్‌కి కరోనాలవ్‌ బర్డ్స్‌కి కరోనా)

అయితే బాలీవుడ్‌లో లవ్‌ బర్డ్స్‌గా‌ పేరొందిన హీరో అర్జున్‌ కపూర్‌, మలైకా ఆరోరాలు ఇటీవల కరోనా బారిన పడినట్లు గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. తనలో ఎలాంటి కోవిడ్‌ లక్షణాలు లేవని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా సెల్ఫ్‌ క్వారంటైన్‌కు వెళ్లాలని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆమె తన పోస్టులో కోరారు. (చదవండి: మలైకాకు కరోనా పాజిటివ్‌: సోదరి అసహనం!)

"Love knows no boundaries". With our social distancing and self quarantine in place, we still find a way to check on eachother, see eachother and talk. While my heart breaks to not be able to hug my two babies for another few days, just looking at their sweet faces gives me so much courage and energy to power through.... #thistooshallpass🙏

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు