విజయ్‌ దేవరకొండతో రొమాంటిక్ మూవీ చేయాలనుంది: హీరోయిన్

20 May, 2022 16:16 IST|Sakshi

Malavika Mohanan Want To Act Romantic Movie With Vijay Devarakonda: అతితక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో మంచి హిట్స్‌ సాధించిన విజయ్ పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో లైగర్‌లో హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతోమంది అమ్మాయిలకు క్రష్‌గా మారిన ఈ రౌడీ హీరోతో నటించాలని ఉందని ఓపెన్‌గా చాలా మంది పాపులర్‌ హీరోయిన్స్‌ తెలిపారు. ఇటీవల లైగర్ బ్యూటీ అనన్య పాండే.. విజయ్‌ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించింది. తాజాగా మరో హీరోయిన్‌ విజయ్ దేవరకొండతో రొమాంటిక్‌ తరహాలో సినిమా చేయాలనుంది తన మనసులోని మాట బయటపెట్టింది. 

సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ 'పెట్టా', విజయ్‌ హీరోగా నటించిన 'మాస్టర్‌' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.యు. మోహనన్‌ కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక ఇటీవల ధనుష్‌తో నటించిన 'మారన్‌' సినిమా ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం 'యుధ్ర' అనే హిందీ మూవీలో నటిస్తోంది. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో 'ఆస్క్ మాళవిక' అనే హ్యాష్‌ట్యాగ్‌తో కాసేపు అభిమానులతో ముచ్చటించి పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు 'విజయ్‌ దేవరకొండతో కలిసి రొమాంటిక్‌ లేదా రోమ్‌ కామ్‌ సినిమా చేయాలనుంది' అని బదులిచ్చింది మాళవిక మోహనన్. 

చదవండి: విజయ్‌ దేవరకొండపై హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

 మరిన్ని వార్తలు