ఆట ఇపుడే మొదలైంది..టీజ‌ర్‌లో ట్రంప్

3 Oct, 2020 10:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న 'మోస‌గాళ్లు'  అఫీషియల్ టీజర్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శనివారం లాంచ్ చేశారు. స్కామ్ రహస్యాలను సూక్ష్మంగా రివీల్ చేసిన అల్లు అర్జున్ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు  శుభాకాంక్షలు తెలిపారు. తన చిన్ననాటి స్నేహితుడు, స్కూల్ మేట్, విష్ణుకి,  ప్రియ నేస్తం కాజల్ అగర్వాల్ కి బస్ట్ విషెస్ అంటూ బన్నీ ట్వీట్ చేశారు. వాస్తవ ఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ క్రేజ్ వాడుకోవాలనే విష్ణు ప్లాన్ బాగానే వర్క అవుట్ అవుతోంది. 450 మిలియన్ డాలర్ల  భారీస్కాంలో నేరస్థుల్ని పట్టుకుంటాం.. అంతం చేస్తాం..అవసరమైన చర్యల్ని తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నాననే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కమెంట్స్ తో ..ఆట ఇపుడే మొదలైందంటూ మరిన్ని అంచనాలు పెంచేశాడు  హీరో విష్ణు.

ఎందుకుంటే విక్టరీ వెంక‌టేష్ రిలీజ్  చేసిన టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌కు అనూహ్యమైన స్పందన వ‌చ్చింది. భారీ బ‌డ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీని విస్తృతంగా ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘మోస‌గాళ్ళు’ చిత్రం రూపొందుతోంది. మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ పోషిస్తుండగా, తొలిసారి తెలుగు తెరకు పరిచయమవుతున్న బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి మరో కీలక పాత్రలో అలరించనున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, మోషన్ పోస్టర్, థీమ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకున్నాయి. జెఫ్రీ గీ చిన్ దర్శకతం  వహిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్. రుహి సింగ్, కర్మ మెక్కెయిన్, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర, రుహీ సింగ్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం , కన్నడ భాషలలో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు