Manoj Bajpayee: '14ఏళ్లుగా భోజనం చేయడం లేదు'.. కారణం చెప్పేసిన మనోజ్‌ బాజ్‌పాయ్‌

11 May, 2023 14:58 IST|Sakshi

బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఫ్యామిలీ మ్యాన్-2తో పాన్‌ ఇండియా లెవల్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించారు. సుమంత్ హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథ’ చిత్రంలో విలన్‌గా నటించారు. అల్లు అర్జున్ మూవీ హ్యాపీలో తనదైన నటనతో మెప్పించారు. 

చదవండి: అహంకారమా? అజ్ఞానమా? పవన్‌ పోస్టర్‌పై పూనమ్‌ ఫైర్‌

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాల విషయం పక్కన పెడితే కొన్నేళ్లుగా నా లైఫ్‌స్టైల్‌ మొత్తం మారిపోయింది. గత 13-14ఏళ్లుగా నేను రాత్రిపూట భోజనం చేయటం లేదు.  దీనివల్ల నా బరువు చాలా అదుపులో ఉంది. దీన్ని నేను మా తాత దగ్గర్నుంచి చూసి నేర్చుకున్నాను.

ఆయన రాత్రుళ్లు భోజనం చేసేవారు కాదు. సన్నగా, ఫిట్‌గా, ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించేవారు. అందుకే నేను కూడా ఆయన్ను ఫాలో అయ్యాను. డిన్నర్‌ మొత్తం మానేయడం అంటే మొదట్లో చాలా కష్టంగా అనిపించేది. ఆకలిని కంట్రోల్‌ చేయడానికి బిస్కెట్లు లాంటివి తినేవాడిని. కానీ క్రమక్రమంగా అలవాటు చేసుకున్నా.

ఈ రొటీన్‌ వల్ల నా బరువు అదుపులో ఉండటంతో పాటు చాలా వరకు ఎనర్జీతో ఉండగలుగుతున్నా అంటూ మనోజ్‌ బాజ్‌పాయ్‌ చెప్పుకొచ్చారు. త్వరలోనే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్‌ షూటింగ్‌లో ఆయన పాల్గొంటారు. చదవండి: సుధీర్‌ బాబు పాన్‌ ఇండియా చిత్రం హరోం హర, గ్లింప్స్‌ చూశారా?

మరిన్ని వార్తలు