Mayukhi Tariler: 'మయూఖి' మూవీ ట్రైలర్.. అలాంటి కాన్సెప్ట్‌తో

20 Nov, 2023 19:57 IST|Sakshi

నంద కిషోర్, డి.టెరెన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'మయూఖి'. దీని ట్రైలర్‌ని నవంబర్ 20న అమెరికాలో విడుదల చేశారు. స్టోరీ విషయానికొస్తే.. మేనకోడలి కోసం మేనమామ చేసే సాహసాలు, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్‌గా  సాగిపోయే ఈ మూవీ షూటింగ్ అంతా అమెరికాలోనే జరిగింది. అమెరికాలో స్థిరపడ్డ 100 మందికి పైగా భారతీయులు, అమెరికన్ల నుంచి ఎంపిక చేసిన కొత్త యాక్టర్స్‌కి స్వయంగా శిక్షణ ఇచ్చి నితిన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)

ఈ యాక్షన్, అడ్వెంచర్ మూవీ అమెరికాలో నిర్మించినా తెలుగువారి అభిరుచికి అనుగుణంగా ఉంటుందని చెప్పిన దర్శకుడు నితిన్ కుమార్ చెప్పాడు. ఎంతో శ్రమపడి డల్లాస్ పరిసరాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో 'మయూఖి' తీసినట్లు పేర్కొన్నాడు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చేశాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త పంథాలో సాగిపోయే ఈ చిత్రంలో రెన్ని, శిరీష, బేబీ మైత్రి, బేబి మయూఖి ప్రధాన పాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు వైరల్!)

మరిన్ని వార్తలు