వైరల్‌ :రూబిక్స్‌ క్యూబ్‌తో చిరంజీవి పిక్చర్‌

23 Aug, 2021 12:22 IST|Sakshi

సాక్షి, చెన్నై : మెగాస్టార్‌ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆదివారం(ఆగస్టు22)న చిరు బర్త్‌డే సందర్బంగా ఆయనకు ప్రముఖులు సహా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడుకు చెందిన కొందరు ఫ్యాన్స్‌ చేసిన వినూత్న ప్రయత్నం అందిరి దృష్టిని ఆకర్షిస్తుంది.

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా తమిళనాడు రూబిక్ క్యూబ్ అసోసియేషన్‌కు చెందిన బిందు, ఆనంద్‌ కలిసి  955 రూబిక్ క్యూబ్స్ తో 6.5 అడుగుల ఎత్తయిన అరుదైన ఫోటోను దృశ్యంతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మరోవైపు ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి వరుస అప్‌డేట్‌లతో సినీ అభిమానులను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా గాడ్‌ఫాదర్‌, బోళ శంకర్‌, ఆచార్య, డైరెక్టర్‌ బాబీ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. 

చదవండి : వైరల్‌ : చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా రాఖీ సెలబ్రేషన్స్‌
చిరు బర్త్‌డే: స్పెషల్‌ సాంగ్‌ని లాంచ్‌ చేసిన శ్రీకాంత్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు