బర్త్‌ డే గిఫ్ట్‌ 

19 Aug, 2020 00:03 IST|Sakshi

చిరంజీవి పుట్టినరోజు వస్తోందంటే మెగా అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ ఉంటుంది. ఆగస్టు 22న ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజున అభిమానులందరూ రక్తదాన శిబిరాలతో పాటు పలు సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది కోవిడ్‌ నేపథ్యంలో అందుకు అనుగుణంగా వేడుకలు ప్లాన్‌ చేస్తున్నారు అభిమానులు. కాగా తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ గిఫ్ట్‌ ఇవ్వనున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 22న సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి కెమెరా: తిరు, సంగీతం: మణిశర్మ. 

మరిన్ని వార్తలు