మా నమ్మకం మరింత పెరిగింది

5 Sep, 2023 03:56 IST|Sakshi

– నవీన్‌ పొలిశెట్టి

‘‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ యునిక్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. మా సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే చిత్రం విజయంపై నమ్మకం మరింత పెరిగింది. కృష్ణాష్టమి రోజు సినిమా రిలీజ్‌ అవుతోంది. కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో, మా సినిమా కూడా అంతే అల్లరిగా ఉంటుంది’’ అని నవీన్‌ పొలిశెట్టి అన్నారు. మహేశ్‌బాబు .పి దర్శకత్వంలో నవీన్‌ పొలిశెట్టి, అనుష్కా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’.

వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ– ‘‘జాతి రత్నాలు’ తర్వాత చాలా కథలు విన్నాను. కానీ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ నచ్చింది. నా ΄ాత్రలో మంచి భావోద్వేగాలు ఉన్నాయి. నాగార్జునగారికి మా ట్రైలర్‌ బాగా నచ్చింది. ‘బిగ్‌ బాస్‌’ హౌస్‌లోకి 15వ కంటెస్టెంట్‌గా వెళ్లాను’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్‌లో చూసింది 30 శాతం అనుకుంటే.. సినిమాలో 70 శాతం భావోద్వేగాలు, వినోదం ఉంటాయి’’ అన్నారు పి. మహేశ్‌బాబు.

మరిన్ని వార్తలు