‘మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’ ఆగిపోయిందా?

18 Sep, 2021 11:16 IST|Sakshi

నిశ్శబ్దం తర్వాత అనుష్క నటించబోయే కొత్త సినిమా పై, కొంత కాలంగా కన్ ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. యూవీ క్రియేషన్స్ లో బ్యానర్ లో, మిస్ శెట్టి ,  మిస్టర్ పొలిశెట్టి టైటిల్ తో తెరకెక్కాల్సి ఉంది. 25 ఏళ్ల పొలిశెట్టి , 40 ఏళ్ల శెట్టితో ప్రేమలో పడితే, ఆ లవ్ స్టోరీ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కాని ఈ ప్రాజెక్ట్ రూమర్స్ కే పరిమితం అవుతోంది. ఎందుకంటే మిస్  శెట్టి ఇప్పుడు ఇతర ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతోందని సమాచారం. తమిళంలో చంద్రముఖి సీక్వెల్ తో పాటు, నెట్రికన్ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాగా ప్రచారం సాగుతోంది.
(చదవండి: జాతిరత్నాలు తర్వాత నవీన్‌ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ఇదే..)

ఇక మిస్టర్ పొలిశెట్టి  అంటే నవీన్ పొలిశెట్టి కూడా,ఇటీవలే త్రివిక్రమ్ కొత్తగా ప్రారంభించిన బ్యానర్ లో నటిస్తున్నట్లు ప్రకటించాడు. జాతిరత్నాలు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఈ చిత్రంలో దర్శకుడిగా మారుతున్నాడు. త్వరలనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇలా ఇద్దరు ఇతర ప్రాజెక్టులో బిజీగా ఉండడంతో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు