దూకుడు పెంచిన నాగ చైతన్య.. ఆ హిట్‌ డైరెక్టర్‌తో నెక్స్ట్‌ సినిమా

19 May, 2021 19:04 IST|Sakshi

అక్కినేని హీరో నాగచైతన్య కెరీర్‌లో చాలా సెలక్టివ్‌ కథలతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీ మూవీలో నటించారు. సాయిపల్లవి తొలిసారిగా నాగచైనత్యతో జోడీ కట్టిన ఈ సినిమా ఏప్రిల్‌16న విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ మూవీలోని టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక లవ్‌స్టోరీ మూవీలోని పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

ఇక విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్న చైతూ మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. 'చలో, భీష్మ' వంటి విజయవంతమైన చిత్రాలతో హిట్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నవెంకీ కుడుములతో ఓ సినిమా ఓకే చేసినట్లు సమాచారం. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్‌లోను  ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అమీర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూ గెస్ట్‌ రోల్‌ పోషించనున్నాడు. తెలుగు కుర్రాడి పాత్రలో చైతు కనిపించనున్నట్లు సమాచారం. అయితే చైతూ పాత్ర దాదాపు 18 నిమిషాల నిడివితో మంచి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తుందని టాక్‌ వినిపిస్తోంది. 

చదవండి : 'డాడీ' మూవీలో చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
శేఖర్‌ కమ్ములకు కోపం వస్తే... సీక్రెట్‌ చెప్పిన చై.. నవ్వులే నవ్వులు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు