Nagababu: అనుమానాలకు తావివ్వకూడదనే స్పందిస్తున్నా: నాగబాబు

3 Apr, 2022 15:22 IST|Sakshi

బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​లోని ఫుడింగ్‌ అండ్ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ బయటపడటం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్‌ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్‌, మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు. 

చదవండి: డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: నటి హేమ

ఫుడింగ్‌ అండ్ మింక్‌ పబ్‌లో నిహారిక ఉండటం, పోలీసుస్టేషన్‌కు తరలించిన వ్యవహారంపై నాగబాబు స్పందించారు. 'నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. అనుమానాలకు తావివ్వకుండా నేను స్పందిస్తున్నా. నిహారికపై అనవసర ప్రచారాలు చేయవద్దు. ' అని నాగబాబు తెలిపారు. కాగా ఈ పబ్‌కు హాజరైన వారిలో ఐదుగురు విదేశీయులు కూడా ఉన్నారని సమాచారం.  పబ్‌లో పాల్గొన్న 142 మంది వివరాలను పోలీసులు వెల్లడించారు. వీరిలో 99 మంది యువకులు, 33 మంది యువతులు పబ్‌లో పాల్గొన్నారు. 142 మంది అడ్రస్‌లు, ఇంటి నెంబర్‌లు తీసుకుని పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

చదవండి: డ్రగ్స్‌ కేసులో నాగబాబు కుమార్తెకు నోటీసులు

మరిన్ని వార్తలు