రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్‌ వైరల్‌

31 Mar, 2021 11:17 IST|Sakshi

రెండో పెళ్లిపై స్పందించిన నాగబాబు

ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో 'ఓకె' చెప్పిన నాగబాబు

మెగా డాటర్‌ నిహారికకు ఇటీవలె పెళ్లి చేసిన నాగబాబు..త్వరలోనే వరుణ్‌తేజ్‌ని సైతం ఓ ఇంటి వాడిని చేయాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఇప్పటికే అమ్మాయిని కూడా వెతికే పనిలో పడ్డారని సమాచారం. ఇదిలా ఉండగా మెగా బ్రదర్‌ నాగబాబు తన రెండో పెళ్లిపై స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్న నాగబాబుకు ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. 'సర్‌..మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని ఓ నెటిజన్‌ అడగ్గా..ఈ వయసులో నాకు పెళ్లా..మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే' అంటూ నాగబాబు సరదాగా బదులిచ్చారు. 

రెండో పెళ్లిపై నాగబాబు చేసిన ఈ కామెంట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్‌ చేస్తూ పలువురు దీన్ని ట్రెండ్‌ చేస్తున్నారు. మరోవైపు రెండో పెళ్లిపై నాగబాబు చేసిన కామెంట్‌పై కొందరు నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే అంటున్నారంటే..మీ మనసులోనూ రెండో పెళ్లిపై ఆలోచన ఉందా?మీరు కూడా మీ తమ్ముడు పవన్‌కల్యాణ్‌ బాటలోనే నడుస్తారా' ? అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 

చదవండి : వరుణ్‌ పెళ్లిపై నాగబాబు కామెంట్‌.. ఆ అమ్మాయి అయినా ఓకేనట
వకీల్‌సాబ్‌ : ట్రైలర్‌కే అద్దాలు పగిలితే.. ఇక సినిమా రిలీజైతే

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు