అల్లుడికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన నాగబాబు.. ఏంటో తెలుసా!

17 Apr, 2021 21:00 IST|Sakshi

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి జొన్నలగడ్డ చైతన్యతో గత డిసెంబర్‌‌ 9న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం నిహారిక-చైతన్య తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. భర్తతో గడిపిన ప్రత్యేక క్షణాలను నిహారిక ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. 

ఈ క్రమంలో తాజాగా నాగాబాబు తన ఒక్కగానొక్క అల్లుడికి ఓ లగ్జరీ గిఫ్ట్‌ను అందించారు. అల్లుడు చైతన్యకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. రేంజ్‌ రోవర్‌ డిస్కవర్‌ తెలుపు రంగు కారును అల్లుడికిస్తూ.. నిహారిక, చైతన్యలను సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ విషయాన్ని నాగబాబు శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు. నా అల్లుడికి ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అంటూ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఈ మేరకు కూతురు నిహారిక, చైతన్యకు కారును డెలివరీ చేస్తున్న ఫోటోను షేర్‌ చేశారు. దీని ఖరీదు దాదాపు 70 లక్షలు ఉంటుదని అంచనా. అయితే వాస్తవానికి ఇది ఉగాదికి ఇవ్వాల్సిన కానుక అని.. కానీ కాస్త ఆలస్యం అయ్యిందని నాగబాబు తన యూట్యూబ్‌ చానల్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు