Nagarjuna Akkineni: హీరో నాగార్జునకు నోటీసులు.. ఎందుకంటే?

21 Dec, 2022 19:24 IST|Sakshi

టాలీవుడ్ కింగ్, బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున నోటీసులు అందుకున్నారు. గోవాలో ఆయన చేపట్టిన నిర్మాణ పనులపై స్థానిక అధికారులు పనులు ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పనులు నిలిపివేయకుంటే తగిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ అధికారులు హెచ్చరించారు. నాగార్జున గోవాలోని మాండ్రెమ్ గ్రామంలోని అశ్వేవాడలో అక్రమ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ "స్టాప్ వర్క్" నోటీసులు అందజేశారు. గ్రామ పరిధిలో  నిర్మాణ పనులకు అధికారుల నుంచి సరైన అనుమతి తీసుకోలేదని పంచాయతీ అధికారులు ఆరోపిస్తున్నారు.

తెలుగు బిగ్ బాస్ సీజన్‌-6 గ్రాండ్ ఫినాలే ఇటీవలే ముగిసింది. అయితే నాగార్జున తదుపరి సీజన్‌లో కనిపించరని ఇటీవల వార్తలొచ్చాయి. నాగార్జున స్థానంలో నటుడు రానా దగ్గుబాటిని పరిశీలిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగార్జున చివరిసారిగా రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్రలో కనిపించారు. అతను సోనాల్ చౌహాన్‌తో కలిసి యాక్షన్-థ్రిల్లర్ డ్రామా 'ది ఘోస్ట్‌'లో  నటించారు. అక్టోబరు 5న విడుదలైన ది ఘోస్ట్  బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

మరిన్ని వార్తలు