Nayanthara Annapoorani Movie: నయన్ 75వ మూవీ.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది?

2 Dec, 2023 18:18 IST|Sakshi

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార 75వ సినిమా 'అన్నపూరణి'. జై, సత్యరాజ్, కేఎస్‌ రవికుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. నికిలేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా కేవలం తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? టాక్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

కథేంటి?
తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్(అచ్యుత్ కుమార్) చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి (నయనతార). చిన్నప్పటి నుంచే తండ్రిని చూస్తే చెఫ్ కావాలని అనుకుంటుంది. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె.. నాన్ వెజ్ ముట్టుకోవడం కూడా పాపం అని తండ్రి అంటాడు. మరి కల కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? చివరకు అనుకున్నది సాధించిందా లేదా? అనేది తెలియాలంటే 'అన్నపూరణి' మూవీ చూడాల్సిందే.

(ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?)

ఎలా ఉందంటే?
చిన్నప్పటి నుంచి వంట చేయడం అంటే ఇష్టమున్న ఓ బ్రాహ్మణ అమ్మాయి.. నాన్ వెజ్ ముట్టుకోవడమే పాపం అని భావించే, తల్లిదండ్రులని ఎదురించి కార్పొరేట్ చెఫ్ ఎలా అయింది? ఇండియన్ నంబర్ వన్ చెఫ్‌గా ఎలా మారింది? అనే కథతో 'అన్నపూరణి' సినిమా తీశారు. కాన్సెప్ట్ పరంగా మంచి లైన్ అయినప్పటికీ.. దర్శకుడు కొన్ని విషయాల్లో తడబడ్డాడు. చాలా సీరియస్‌గా చెప్పాల్సిన కొన్ని సీన్స్‌ని కామెడీ చేసేశాడని అంటున్నారు. దీంతో ఫీల్ మిస్ అయిందని మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్‌గా చెప్పుకుంటే యావరేజ్ సినిమా అని తీర్పు ఇచ్చారు.

ఎవరెలా చేశారు?
ఇలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేయడంలో నయన్ ఇప్పటికే స్పెషలిస్ట్ అయిపోయింది. అన్నపూరణి అనే అమ్మాయిగా అదరగొట్టేసింది. జై, సత్యరాజ్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్ పరంగా తమన్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతానికైతే ఈ మూవీ తమిళంలో మాత్రమే రిలీజైంది. ఓటీటీలో విడుదల చేసినప్పుడు తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేస్తారనిపిస్తోంది. 

(ఇదీ చదవండి: Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ)

మరిన్ని వార్తలు