'యానిమల్‌'లో దుమ్మురేపిన రష్మిక.. రెమ్యునరేషన్‌ అన్ని కోట్లా..?

2 Dec, 2023 15:56 IST|Sakshi

టాలీవుడ్‌లో 'ఛలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న పుష్ప మూవీతో 'నేషనల్ క్రష్'గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తన గ్లామర్‌తో పాటు అదిరిపోయే యాక్టింగ్​తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేషనల్ క్రష్​గా దేశవ్యాప్తంగా ఇమేజ్​ క్రియేట్ చేసుకున రష్మిక తాజాగా యానిమల్‌ చిత్రంలో మెప్పించింది. 'యానిమల్​' చిత్రంలో  రణ్​బీర్​ కపూర్​తో నటించిన ఈ బ్యూటీకి మంచి మార్కులే పడుతున్నాయి. బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం మొదటిరోజే రూ. 116 కోట్ల (గ్రాస్‌) కలెక్షన్స్‌ రాబట్టింది.

పుష్ప తర్వాత రష్మికకు మళ్లీ ఆ స్థాయిలో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఓ వెలుగు వెలిగింది. ఈ సినిమా కోసం ఆమె భారీగానే రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. యానిమల్‌ సినిమా ముందు వరకు ఆమె రూ. 3కోట్ల నుంచి 4 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకునే వారని టాక్‌... కానీ యానిమల్‌ సినిమా కోసం రష్మిక ఏకంగా రూ. 7 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. యానిమల్‌ సినిమాలో  రష్మిక రోల్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కథలో ఆమెకు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రనే ఆఫర్‌ చేశాడు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా... అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తన నటన విశ్వరూపం చూపించింది రష్మిక..

కానీ ఇందులో ఎక్కువగా లిప్‌లాక్‌ సీన్స్‌తో పాటు పలు బోల్డ్‌ డైలాగ్స్‌ కూడా రష్మిక చెప్పడం.. అంతే కాకుండా రణబీర్‌తో టాప్‌లెస్‌ సీన్‌ చేయడం వంటి వాటికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఒకరకంగా గ్రేట్‌ అనే చెప్పవచ్చు. ఆ సీన్స్‌ కూడా కావాలని కథలో ఇరికించినట్లు ఉండవు.. కథకు మరింత బలాన్ని ఇచ్చేలా అవి ఉంటాయి. అందుకే రష్మిక కూడా ఓకే చెప్పి ఉంటుందని తెలుస్తోంది.

ఇందులో రష్మిక కూడా రణబీర్‌కు ఏ మాత్రం తగ్గకుండా తన యాక్టింగ్‌తో ఇరగదీసిందనే చెప్పాలి. సుమారు యానిమల్‌ కోసం రూ. 200 కోట్లు ఖర్చు పెట్టారని టాక్‌ ఉంది. ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన యానిమల్‌ కోసం ఆమెకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ రూ. 7కోట్లు అని టాక్‌.. ఈ సినిమాలో ఆమె తీసుకున్న రెమ్యునరేషన్‌కు మించి తన రోల్‌లో మెప్పించిందన రష్మిక ఫ్యాన్స్‌ చెబుతున్నారు. ఈ సినిమా చూసిన వారు ఎవరైనా సరే రష్మిక టాలెంట్‌కు  రూ.10 కోట్లు ఇచ్చినా తక్కువే అనడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు