-
'ది ఇండియన్ స్టోరీ' సినిమా రివ్యూ
ఈ వారం థియేటర్లలోకి ఐదుకి పైగా సినిమాలు వచ్చాయి. వీటిలో 'ఆ ఒక్కటి అడక్కు', 'ప్రసన్నవదనం' చిత్రాలు ఉన్నంతలో కాస్త అంచనాలతో రిలీజయ్యాయి. వీటితోపాటు వచ్చిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ 'ది ఇండియన్ స్టోరీ'. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్. రాజ్ భీమ్ రెడ్డి నిర్మించారు. సమాజంలో మత సామరస్యం ఉండాలనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ఆర్. రాజశేఖర్ రెడ్డి తీశారు. ఇంతకీ మూవీ ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మత విద్వేషాలు రగిలే రాష్ట్రంలో హిందూ వర్గానికి శ్రీరామ్ (రామరాజు), ముస్లిం వర్గానికి కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్) నాయకత్వం వహిస్తుంటారు. ఒకరిపై మరొకరు ప్రతీకార దాడులు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి టైంలో వైజాగ్ నుంచి రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి) వస్తాడు. ఇతడి దగ్గర బంగారు బిస్కెట్లు ఉంటాయి. అవి అమ్మడానికి స్నేహితుడు ఫేకు (చమ్మక్ చంద్ర) సాయం తీసుకుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో కత్తిపోట్లకు ఎదురెళ్లి కబీర్ ఖాన్ని రెహమాన్ కాపాడతాడు. అనంతరం కబీర్ వర్గంలో ఓ నాయకుడిగా మారతాడు. కబీర్ కూతురు డాక్టర్ ఆయేషా (జరా ఖాన్)తో ప్రేమలో పడతారు. ఓ సంఘటన వల్ల రెహమాన్‌పై కబీర్ దాడి చేస్తాు. అసలు దీనికి కారణమేంటి? శ్రీరామ్, కబీర్ గతమేంటి? మతం పేరుతో ఈ ఇద్దరు.. ప్రజల మధ్య ఎలా చిచ్చు పెడుతున్నారు? చివరకి ఏమైందనేదే సినిమా.(ఇదీ చదవండి: ‘శబరి’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అని చెప్పే సినిమా ఇది. మతం పేరుతో జరుగుతున్న దాడుల గురించి ప్రజలకు కనువిప్పు కలగజేసే మూవీ ఇది. హీరో, చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ మధ్య మంచి కామెడీతో ఈ సినిమా సరదాగా మొదలవుతుంది. ఆ తర్వాత ముస్తాఫా, రవి, రహీం హత్యలతో ఒక వర్గంపై మరో వర్గం దాడులు చేసుకుంటున్న టైమ్ లో ముస్లిం లీగ్ పార్టీ పేరుతో కబీర్ ఖాన్, శక్తి సేన పార్టీ పేరుతో శ్రీరామ్ రాజకీయ రంగంలోకి దిగుతారు. ఇక్కడి నుంచి మతం పేరుతో జరిగే రాజకీయ క్రీడను దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి ఇంట్రెస్టింగ్గా తీశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఫస్టాఫ్‌లో వచ్చిన సందేహాలకు సెకండాఫ్‌లో ఒక్కొక్కటిగా సమాధానం దొరుకుతుంది. క్లైమాక్స్ ఆసక్తికరంగా అనిపిస్తుంది.హీరోగా రాజ్ భీమ్ రెడ్డి ఆకట్టుకున్నాడు. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ఎమోషన్ ఉంటుంది. ఫైట్లు బాగానే తీశారు. హీరోయిన్ జరా ఖాన్ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. శ్రీరామ్‌గా రామరాజు, కబీర్ ఖాన్‌గా ముక్తార్ ఖాన్ ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం ఇలా అందరూ తమ తమ పనికి పూర్తి న్యాయం చేశారు.(ఇదీ చదవండి: సుహాస్ 'ప్రసన్న వదనం' రివ్యూ.. మరో హిట్ పడినట్టేనా?) -
సుహాస్ ప్రసన్న వదనం.. మరో హిట్ పడినట్టేనా?
టైటిల్: ప్రసన్న వదనంనటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుడైరెక్టర్: అర్జున్ వైకేనిర్మాతలు: మణికంఠ జేఎస్, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్‌ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్విడుదల తేదీ: 03-05-2024టాలీవుడ్లో యంగ్ హీరో సుహాస్ ప్రత్యేక శైలితో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తాజాగా మరోసారి ప్రసన్న వదనం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. సుకుమార్ వద్ద పని చేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫేస్ అండ్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి సరికొత్త కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యిందా? కొత్త దర్శకుడితో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? చూసేద్దాం పదండి. అసలు కథేంటంటే...ఓ ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోతాడు సూర్య(సుహాస్). అసలే కష్టాల్లో ఉన్న అతనికి మరో వింత డిజార్డర్ కూడా వస్తుంది. తలకి బలంగా గాయం కావడంతో ఫేస్ బ్లైండ్నెస్ డిజార్డర్ వస్తుంది. అంటే అతను ఎవరినీ గుర్తించలేడు. ఓ ఎఫ్ఎం స్టేషన్లో ఆర్జేగా పని చేస్తున్న సూర్య ఓ అర్ధరాత్రి దారుణమైన ఘటనను ప్రత్యక్షంగా చూస్తాడు. అమృత(సాయి శ్వేత)అనే అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేస్తారు. అయితే ఈ ఘటనని ప్రత్యక్షంగా చూసిన సూర్య.. తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉండటం వల్ల ఆ వ్యక్తి ఎవరనేది గుర్తుపట్టలేడు. మరుసటి రోజే అది యాక్సిడెంట్ అని వార్తల్లో వస్తుంది. ఇది చూసిన సూర్య బాధితురాలికి న్యాయం చేయాలని భావించి పోలీసులకు ఫోన్ చేసి అసలు సంగతి చెబుతాడు. ఈ కేసుని ఏసీపీ వైదేహి(రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అసలు పోలీసులు నిందితున్ని పట్టుకున్నారా? దర్యాప్తులో ఎలాంటి నిజాలు రాబట్టారు? ఫేస్ బ్లైండ్‌నెస్‌తో సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు ? అసలు అమృతని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ? అనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.ఎలా సాగిందంటే.. ఇలాంటి ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటివరకూ సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్‌ను తీసుకున్న డైరెక్టర్ అర్జున్ ఆ పాయింట్‌ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. సూర్య తల్లితండ్రులు ప్రమాదంలో చనిపోవడం.. సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం.. ఆ తర్వాత అతను పడే ఇబ్బందులు, అధ్య(పాయల్ రాధకృష్ణ) రూపంలో ఓ క్యూట్ లవ్ స్టొరీతో కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లాడు. కథలోకి క్రైమ్ ఎలిమెంట్ వచ్చిన తరవాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నిజంగానే బ్లైండ్నెస్ వచ్చేలా చేస్తుంది. అంటే అంతలా సస్పెన్ష్ ఉంటుందన్నమాట.సెకండాఫ్‌కు వచ్చేసరికి కథను మరింత గ్రిప్పింగ్‌గా నడిపించారు డైరెక్టర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. కథను అంత పకడ్బందీగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో హైలెట్‌గా నిలిచింది. అప్పటివరకూ కాస్తా స్లో నేరేషన్ అనిపించినప్పటికీ ఈ కథకు ఇచ్చిన ముగింపు మాత్రం అదిరిపోయింది.ఎవరెలా చేశారంటే...సూర్య పాత్రలో సుహాస్ సహజంగా ఒదిగిపోయాడు .తనదైన నటనలో ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. పాయల్ తన అందంతో పాత్రలో ఒదిగిపోయింది. రాశి సింగ్, నితిన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. హర్ష, సత్య కామెడీతో అదరగొట్టేశారు. ఓవరాల్‌గా నందుతో పాటు మిగిలిన నటీనటులు తమపాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్‌లో తన కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా తొలి సినిమాతోనే దర్శకుడు అర్జున్ తన మార్క్ చూపించారు. -
Death Whisperer Review: అమ్మాయిలను వెంటాడే దెయ్యం..చివరికేమైంది?
టైటిల్: డెత్ విస్పరర్డైరెక్టర్: థావివాత్ వాంతానటీనటులు: నదెచ్ కుగిమియ, జూనియర్ కజ్భుందిట్, పీరకృత్ పచరబూన్యకైట్, దెడిస్ జెలిల్చ కపౌన్నిడివి: 2 గంటలుఓటీటీ: నెట్ఫ్లిక్స్హారర్ సినిమాలకు ప్రత్యేక అభిమానులుంటారు. కొందరు భయమనేదే లేకుండా.. కన్నార్పకుండా సినిమా చూస్తారు. మరికొందరు ఎంత భయమేసినా సరే.. నిండా దుప్పటి కప్పుకుని మరీ చూస్తుంటారు. హారర్ సినీప్రియులందరికోసం ప్రతియేడూ బోలెడన్ని సినిమాలు రిలీజవుతున్నాయి. అలా గతేడాది డెత్ విస్పరర్ అనే థాయ్ మూవీ రిలీజైంది. క్రిట్టనాన్ రచించిన టీ యోడ్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కథేంటి? ఎలా ఉందో చూద్దాం..కథేంటంటే..అది 1970.. థాయ్‌లాండ్ కాంచనబూరిలోని గ్రామంలో ఓ ఫ్యామిలీ సంతోషంగా జీవనం సాగిస్తుంటుంది. ఇంటి పెద్ద పొలం పని చేస్తుంటాడు. చాలా స్ట్రిక్ట్. భార్య ఇంటి పనికే పరిమితమవుతుంది. వీరికి ముగ్గురమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు సంతానం. పిల్లలు బడికి వెళ్లేముందు, వచ్చాక తల్లికి ఇంటిపనిలో సాయపడుతుంటారు. ఇద్దరబ్బాయిలు తండ్రికి పొలంలో సాయం చేస్తారు. అందరికంటే పెద్దవాడైన యాక్ మిలిటరీలో పని చేస్తాడు. కానీ ఓ రోజు ఉన్నట్లుండి ఇంటికి వచ్చేస్తాడు. అప్పటికే ముగ్గురమ్మాయిలకు స్కూలుకు వెళ్లే దారిలో ఓ చెట్టు కింద దెయ్యం కనిపిస్తూ ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ దెయ్యం కనిపిస్తుంది.పన్ను పీకి చేతబడిఆ దెయ్యం అందరికంటే ఆరోగ్యంగా ఉన్న యామ్ను ఆవహించేందుకు సెలక్ట్ చేసుకుంటుంది. దీంతో తను అనారోగ్యానికి లోనవుతుంది. వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఓ రోజు చూయ్ అనే మంత్రగత్తె కిటికీలోంచి ఆ అమ్మాయి గదిలోకి దూరం తన పన్ను పీకి దానిపై చేతబడి చేస్తుంది. ఈ విషయం తెలిసి మిలిటరీ నుంచి వచ్చిన అన్న తనను చావబాదడానికి వెళ్తే తనే ఆత్మహత్య చేసుకుంటుంది. అక్కడినుంచి ఈ కుటుంబానికి కష్టాలు మొదలవుతాయి.క్లైమాక్స్‌లో ట్విస్ట్రాత్రిపూట దెయ్యం ఏదో వింతవింత(గుసగుసలాడినట్లు) శబ్దాలు చేయడం, అది విన్నవారు స్పృహ తప్పిపోవడం.. అర్ధరాత్రి యామ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం, ఆమెను వెతికి తీసుకురావడం.. ఇదే జరిగేది. దెయ్యం వారిని మానిప్యులేట్ చేయడానికి ట్రై చేసినా.. ప్రాణాలకు తెగించి మరీ యాక్ తన చెల్లిని బతికించేందుకు ప్రయత్నిస్తాడు. దెయ్యం ఎక్కడైతే కనిపించిందో ఆ చెట్టును కొట్టేసి అక్కడున్న మానవ మాంసాన్ని కాల్చేస్తారు. తర్వాత ఆస్పత్రికి వెళ్లే దారిలో దెయ్యాన్ని కూడా షూట్ చేస్తారు. ఇక దాని పీడ విరగడైందనుకున్న సమయంలో డైరెక్టర్ ట్విస్ట్ ఇచ్చాడు.. అదేంటో తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?డెత్ విస్పరర్స్.. ఈ మూవీలో హారర్కే పెద్ద పీట వేశారు. కామెడీ జోలికి వెళ్లలేదు. అయితే సినిమా అంతా ఒక ఫ్లోలో వెళ్లిపోతుంది. పెద్దగా ఎగ్జయిట్ అయ్యే విషయాలంటూ ఏమీ ఉండవు. నటీనటులు బాగా యాక్ట్ చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్ మీద కాస్త ఫోకస్ చేయాల్సింది. క్లైమాక్స్ చివర్లో సీక్వెల్ ఉంటుందని హింటిచ్చారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. అయితే తెలుగు ఆడియో, సబ్‌టైటిల్స్ లేవు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో సినిమా చూసేయొచ్చు. -
ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!
ఓటీటీల్లో బోర్ కొట్టని జానర్ అంటే థ్రిల్లరే. మిగతా సినిమాల సంగతేమో గానీ థ్రిల్లర్స్ ని థియేటర్లలో కంటే సింగిల్ గా ఇంట్లోనే చూడటం బెస్ట్ అని చెప్పొచ్చు. అలా హాలీవుడ్ లో 2014లోనే వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ 'ప్రీ డెస్టినేషన్'. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నిజంగా అంత బాగుందా? ఏంటనేది డీటైల్డ్ గా చూద్దాం.(ఇదీ చదవండి: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ)'ప్రీ డెస్టినేషన్' విషయానికొస్తే.. ఈ సినిమాలో బేబీ జేన్, జేన్, జాన్, బార్ కీప్, ఫిజిల్ బాంబర్ అని ఐదు పాత్రలు ఉంటాయి. 1945-1992 మధ్య కాలంలో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అసలు వీళ్ల ఐదుగురికి కనెక్షన్ ఏంటి? చివరకు ఏమైందనేదే అసలు కథ.కొన్ని సినిమాలు చూడటానికి చాలా సాధారణంగా ఉంటాయి. 40 నిమిషాలు అయ్యేవరకు 'ప్రీ డెస్టినేషన్' కూడా అలానే అనిపిస్తుంది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ ఐదు పాత్రలకు సంబంధించిన డీటైల్స్ అన్ని ప్రేక్షకుల అర్థమైన దగ్గర నుంచి థ్రిల్ కలిగిస్తుంది. ఐదు పాత్రలు టైమ్ ట్రావెలింగ్ చేస్తుంటే.. చూస్తున్న మనకు సరికొత్త అనుభూతి, థ్రిల్ అనిపిస్తుంది. ఇక్కడ నిజంగా టైమ్ ట్రావెల్ అనేది సాధ్యమా కాదా అనేది పక్కనబెట్టి చూస్తే మాత్రం మూవీ నచ్చేస్తుంది. ఇంతకంటే ఒక్క విషయం ఎక్కువ చెప్పినా సరే మళ్లీ కథ లీక్ చేసి, మేమే మీకు స్పాయిలర్స్ ఇచ్చేసినట్లు అయిపోద్ది!(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య)'ప్రీ డెస్టినేషన్' సినిమాని గ్రేటెస్ట్ అని చెప్పలేం కానీ డిఫరెంట్ మూవీస్ అంటే ఇష్టపడే మూవీ లవర్స్ కచ్చితంగా మిస్సవకుండా చూడాల్సిన మూవీ. 2014లోనే రిలీజైన ఈ చిత్రం హాలీవుడ్ ఆడియెన్స్ కి తెగ నచ్చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత గ్లోబల్ ఆడియెన్స్ కి మరింత చేరువైంది. ఇదే మూవీ కథని స్ఫూర్తిగా తీసుకుని తెలుగులో పలు సినిమాలు తీయడం విశేషం. అవేంటో చెబితే మళ్లీ స్టోరీ చెప్పిసినట్లు అవుతుంది.లాస్ట్ అండ్ ఫైనల్.. ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత 'అత్తారింటికి దారేది' సినిమాలోని ఫేమస్ డైలాగ్ కచ్చితంగా గుర్తొస్తుంది. అదేంటనేది 'ప్రీ డెస్టినేషన్' చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కేవలం 97 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాని అలా మొదలుపెడితే ఇలా ముగించేయొచ్చు. మరి ఇంకెందుకు లేటు త్వరగా చూసేయండి.(ఇదీ చదవండి: ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!) -
Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్ గురు'.. ఎలా ఉందంటే?
వైవిధ్య పాత్రలను పోషిస్తూ అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చిత్రం ‘లవ్ గురు’. ఆయన నటించిన తొలి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లవ్ గురు’ కథేంటంటే.. ఆర్థిక సమస్యల కారణంగా మలేసియా వెళ్లిన అరవింద్(విజయ్ ఆంటోని) కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. అప్పటికే ఆయనకు 35 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. డబ్బు సంపాదనలో పడి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. ఇప్పటికైనా ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పాలని సొంతూరు సింహాచలం వెళ్తాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా ఓసారి చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల(మృణాళిని రవి) చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ తల్లిదండ్రులు.. లీల తండ్రితో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తారు. లీలకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీమ్. కానీ ఆమె తండ్రికి కూతురు నటిగా మారడం ఇష్టం ఉండదు. బలవంతంగా అరవింద్‌తో పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లైన మరుసటి రోజు అరవింద్‌కు ఈ విషయం తెలుస్తుంది. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత అరవింద్‌ను దూరం పెడుతుంది లీల. విడాకులు తీసుకుందామని చెబుతుంది. లీల డ్రీమ్ గురించి తెలిసిన తర్వాత ఆమెపై మరింత ప్రేమను పెంచుకుంటాడు అరవింద్. ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? భార్య ప్రేమను పొందడానికి అరవింద్ ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న గతమేంటి? లీలా జీవితంలోకి వచ్చిన విక్రమ్ ఎవరు? జనని ఎవరు? ఆమెకు అరవింద్‌కు ఉన్న సంబంధం ఏంటి? నిప్పు అంటే అరవింద్‌కు ఎందుకు భయం? హీరోయిన్ కావాలనే లీల కల నెరవేరిందా లేదా? చివరకు వీరిద్దరు విడిపోయారా? లేదా దగ్గరయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విజయ్ ఆంటోని సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఓ మంచి సందేశం ఉంటుంది. ‘లవ్ గురు’ కూడా అదే తరహా కథ. ఓ మహిళ కలకు పెళ్లి అడ్డం కాకూడదని, మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే అసలైన ప్రేమ అనే ఓ సందేశాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది ఇందులో కొత్తదనమేమి ఉండడు. హీరోతో పెళ్లి హీరోయిన్‌కి ఇష్టం ఉండడు. పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుంటారు. ఆమె ప్రేమను పొందడానికి హీరో రకరకాల ప్రయత్నం చేస్తాడు. చివరకు ఒక్కటవుతారు.. ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. కానీ వినోదాత్మకంగా కథనాన్ని సాగించడం లవ్‌గురు ప్రత్యేకత. కేలవం భార్యభర్తల రిలేషన్‌ని మాత్రమే కాకుండా సిస్టర్ సెంటిమెంట్‌ని కూడా జోడించడం ఈ సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. హీరోహీరోయిన్ల పాత్రలతో చాలా మంది కనెక్ట్ అవుతారు. జీవిత భాగస్వామిని ఎలా ప్రేమించాలి అనేది ఈ సినిమాలో చూపించారు. అరవింద్‌ని ఓ పీడకల వెంటాడే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. మలేసియా నుంచి ఇండియాకు తిరిగి రావడం.. చావు ఇంటిలో లీలను చూసి ఇష్టపడడం.. పెళ్లి చేసుకొని హైదరాబాద్‌కు మకాం మార్చడం వరకు కథనం సింపుల్‌గా సాగుతుంది. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత లీల స్నేహితులు చేసే హంగామ నవ్వులు పూయిస్తాయి. అలాగే విజయ్ ఆంటోనికి.. వీటీవీ గణేష్ మధ్య జరిగే సంభాషణ కూడా వినోదాన్ని పంచతుంది. యోగిబాబు ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. భార్య ప్రేమను గెలుచుకోవడం కోసం హీరో చేసే పని షారుక్ ‘రబ్ నే బనా ది జోడి’ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా అంటూ లీల ప్రెండ్స్ చేసే హంగామా బోర్ కొట్టిస్తుంది. అరవింద్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. అరవింద్‌గా విజయ్ ఆంటోనీ తన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన హావాభావాలతో మెప్పించారు. లీల పాత్రలో మృణాళిని రవి మెప్పించింది. తన అందంతో తెరపై ఆకట్టుకుంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement