Nayanthara: నయనతార ట్విన్స్‌ను చూశారా.. ఎంత క్యూట్‌గా ఉన్నారో!!

26 Sep, 2023 14:42 IST|Sakshi

సౌత్‌ ఇండియాలో తన అభినయం, అందంతో అభిమానులను సొంతం చేసుకున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ సరసన జవాన్‌ మూవీలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించగా.. దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లోన కనిపించారు. 

(ఇది చదవండి: వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే..)

అయితే గతేడాది కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట అధికారికంగా మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అంతేకాకుండా ఈ జంటకు సరోగసీ ద్వారా కవల పిల్లలు కూడా జన్మించారు. వీరికి ఉయిర్, ఉలగం అని నామకరణం చేశారు. 

(ఇది చదవండి: ఒక్క సినిమాతో ఆ రేటింగ్స్‌నే మార్చేసిన నయనతార

తాజాగా నయన్ సోషల్ మీడియాలో పోస్ట్ తెగ వైరలవుతోంది. తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోను పంచుకుంది. అయితే గతంలో ట్విన్స్‌తో ఉన్న ఫోటోను పంచుకున్న నయన్.. తాజాగా మరో పిక్‌ను షేర్ చేసింది.  అయితే ఈ ఫోటో ట్విన్స్ పుట్టినప్పుడు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోల్లో కవల పిల్లలిద్దరూ చాలా క్యూట్‌గా ఉన్నారు . ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్యూట్‌ బేబీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

మరిన్ని వార్తలు