జుగ్‌ జుగ్‌.. చిన్న బ్రేక్‌!

25 Apr, 2021 06:34 IST|Sakshi

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా హిందీ చిత్రం ‘జుగ్‌ జుగ్‌ జియో’ (కలకాలం జీవించు, ఆశీర్వాదం, దీవెన వంటి చాలా అర్థాలున్నాయి) చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ‘‘కరోనా ఫస్ట్‌ వేవ్‌ తర్వాత మేం షూటింగ్‌ ఆరంభించాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మా సినిమా హీరో వరుణ్‌ ధావన్‌కు కరోనా సోకింది. వరుణ్‌తో పాటు మరికొందరు కరోనా బారిన పడ్డారు. ఎలాగోలా ఆ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. కరోనా సెకండ్‌ వేవ్‌ను ఊహించని మేం మా సినిమా షూటింగ్‌ను ఈ నెలలో ముంబయ్‌లో ప్లాన్‌ చేశాం. ముందస్తుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. కానీ ఇప్పుడు షూటింగ్‌ జరపలేని పరిస్థితి. ఈసారి రిస్క్‌ తీసుకోవాలనుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాతే చిత్రీకరణ ఆరంభిస్తాం. ఇప్పటికి నలభై శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అని ఈ చిత్రదర్శకుడు రాజ్‌ మెహతా పేర్కొన్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నీతూ కపూర్, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రధారులు.

మరిన్ని వార్తలు