ఈ రాశివారికి కుటుంబ సమస్యలు వేధిస్తాయి

25 Apr, 2021 06:41 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.త్రయోదశి ప.2.13 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం హస్త రా.12.46 వరకు, తదుపరి చిత్త వర్జ్యం ఉ.9.55 నుంచి 11.27 వరకు దుర్ముహూర్తం సా.4.32 నుంచి 5.21 వరకు, అమృతఘడియలు... రా.7.03 నుంచి 8.33 వరకు.

సూర్యోదయం        :  5.42
సూర్యాస్తమయం    :  6.13
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు:
మేషం: వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధనలబ్ధి. ఉద్యోగయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కాస్త అనుకూలత. 

వృషభం: ఆర్థికపరమైన ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలలో ఆటంకాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: కార్యక్రమాలలో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. కాంట్రాక్టులు చేజారతాయి. అనారోగ్యం. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి.ఉద్యోగాలలో అదనపు పనిభారం. 

కర్కాటకం: చిరకాల కోరిక నెరవేరుతుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కొంత ఊరట. 

సింహం: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యపరమైన చికాకులు. సోదరులు, మిత్రులతో కలహాలు. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.. 

కన్య: ఆర్థికపరంగా ఆశాజనకం. ఆస్తి వివాదాలు తీరతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

తుల: అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి. భూవివాదాలు నెలకొంటాయి. 
వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.. 

వృశ్చికం: దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం.  కార్యజయం. ప్రత్యర్థులు కూడా సహకరిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో వ్యయప్రయాసలు. 

ధనుస్సు: కొత్త కార్యక్రమాలు  చేపడతారు. ధన, వస్తులాభాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: ప్రయాణాలలో ఆటంకాలు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరులు, మిత్రులతో  కలహాలు. రాబడి అంతగా కనిపించదు. వ్యాపారాలు ఒడిదుడుకులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కుంభం: ఆర్థిక ఇబ్బందులు. బంధువిరోధాలు. పనుల్లో  అవాంతరాలు. అనారోగ్య సూచనలు.  వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు. దూరప్రయాణాలు ఉంటాయి.

మీనం: ధనలబ్ధి. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. దైవదర్శనాలు.
 

మరిన్ని వార్తలు