ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ వాయిదా అంటూ వార్తలు, మండిపడుతున్న నెటిజన్లు

1 Jan, 2022 14:25 IST|Sakshi

న్యూ ఇయర్‌లో అందరికి బిగ్‌ షాక్‌ ఇస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ విడుదల వాయిదా అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు న్యూ ఇయర్‌, సంక్రాంతికి పండగ కల తెచ్చేందుకు జనవరి 7న వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మళ్లీ వాయిదా అంటూ వార్తలు వినిపించడంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాకవుతున్నారు.

జులైలో మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లుగా సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా పడుతుందని తీవ్ర నిరాశకు గురైన కొంతమంది నెటిజన్లు మండిపడుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాపై మీమ్స్‌ క్రియేట్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. జూలైలో ఇంకో క‌రోనా వేరియంట్ వ‌స్తే అప్పుడు కూడా మ‌ళ్లీ పోస్ట్ పోన్ చేస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో నెటిజ‌న్లు ఫ‌న్నీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల అయ్యేలోపు నేను ముస‌లోడిని అయిపోతానేమో అంటూ ఒకరు పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ విడుద‌ల అయ్యేలోపు చిరంజీవి 200వ సినిమా కూడా విడుద‌ల అవుతుంద‌ని మరికొంద‌రు సెటైర్లు వేస్తున్నారు. రాజ‌మౌళితో పెట్టుకుంటే ఇంతేన‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు. టెన్ష‌న్ త‌ట్టుకోలేక‌పోతున్నామ‌ని, వెంట‌నే ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల‌పై ఆ సినీ యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న చేయాల‌ని కొంద‌రు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు