అనసూయ స్థానంలో కొత్త యాంకర్‌, ఎవరో తెలుసా?

31 Jul, 2022 16:54 IST|Sakshi

అనసూయ.. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ యాంకర్‌.. అటు సినిమాలు చేసుకుంటూనే ఇటు బుల్లితెరపైనా పలు షోలతో అలరిస్తోంది. తనకు నచ్చినట్లుగా రెడీ అవుతూ ఎవరేమన్నా పట్టించుకోకుండా ముందుకెళ్లిందీ ముద్దుగుమ్మ. అయితే కొన్నేళ్లుగా యాంకర్‌గా కొనసాగుతున్న ఓ కామెడీ షోకు అనసూయ ఇటీవలే గుడ్‌బై చెప్పేసింది. ఎంతోమంది ఆమె కొనసాగాలని కోరుకున్నా తను మాత్రం వెళ్లిపోవడానికే మొగ్గుచూపింది. దీంతో ఇప్పుడా కామెడీ షో యాజమాన్యం అనసూయ స్థానాన్ని భర్తీ చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది.

అనసూయకు ధీటుగా అందాల రాశిని షోలో దించింది. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజ్‌ చేసింది. పల్లకిలో తీసుకువచ్చి ఘనస్వాగతం పలికారు. కానీ ఆమె కనబడకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో ఆమె ఎవరా? అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. యాంకర్‌ రష్మీనే ఈ షోలోనూ అదరగొట్టనుందని కొందరంటుంటే ఆమె యాంకర్‌ మంజూషా అని మరికొందరు అంటున్నారు. మరి ఆమె ఎవరనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే!

చదవండి: మాధవన్‌, నంబి నారాయణన్‌ను సత్కరించిన రజనీకాంత్‌

మరిన్ని వార్తలు