భర్త ప్రేమ సందేశం: నిహారిక భావోద్వేగం

25 Jan, 2021 14:38 IST|Sakshi

నాగబాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారిక ఇటీవలే పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టి విషయం తెలిసిందే. నిహారిక, చైతన్యల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డిసెంబర్‌ 9న వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పోస్టు చేస్తూ చైతన్యపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు నిహారిక. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లిలో జరిగిన కొన్ని కీలకమైన దృశ్యాలను కట్‌ చేసి ఓ వీడియో రూపంలో షేర్‌ చేశారు. ఇందులో నిహారికను పెళ్లి కూతురిని చేస్తున్నప్పటి నుంచి తాళి కట్టే సందర్భం, పెళ్లి వేడుకలో చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌, వరుణ్‌ తేజ్‌ ఎంజాయ్‌ చేస్తున్న దృశ్యాలు, ఇలా ఎన్నో మధుర క్షణాలను ఈ వీడియోలో పంచుకున్నారు. ఇక తాళి కడుతున్న సందర్భంలో నిహారిక తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. చదవండి: మాటలు తగ్గించేసింది: నాగబాబు ఎమోషనల్‌

అలాగే పెళ్లి కుమార్తెగా సిద్ధమవుతున్న సమయంలో కాబోయే భర్త చైతన్య పంపించిన ఓ సందేశంతో నిహారిక కన్నీళ్లు పెట్టుకున్నారు. ''డియర్ నిహా.. మూడు ముళ్ల బంధంతో మన ప్రయాణాన్ని మొదలుపెడుతున్న ఈ సమయంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటాను. 30 ఏళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని.. నా జీవితానికి అర్థం నువ్వేనని కూడా తెలిసింది'' అని పేర్కొన్నారు చైతన్య. ఇక కాబోయే వాడు అంతా ప్రేమగా ఈ మాటలు చెప్పడంతో అది విన్న నిహారిక పట్టరానంత ఆనందంతో ఏడ్చేశారు. కళ్యాణ తిలకం దిద్దుతున్న చిరంజీవి కూతూరు సుష్మితను హత్తుకొని చాలా ఎమోషనల్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి : హ్యాపీ బర్త్‌డే బంగారు.. ఐ లవ్‌ యూ..

A post shared by Niharika Konidela (@niharikakonidela)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు