అలా లీనమైపోయిన నివేథా.. వీడియో వైరల్‌ 

29 Jun, 2021 20:02 IST|Sakshi

హీరోయిన్‌ నివేదా థామస్‌. ఈ ఏడాది వకీల్‌సాబ్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలోని  పల్లవి పాత్రలో నివేథా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉండగా, తాజాగా గిటార్‌ వాయిస్తూ తన సింగింగ్‌ టాలెంట్‌ను కూడా బయటపెట్టేసింది. 2008లో విడుద‌లైన “జానే తు యా జానేనా” అనే సూపర్‌ హిట్‌ మూవీలోని కభీ కభీ అధితీ జిందగీ అనే పాటను పాడుతూ తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిన్లను ఆకట్టుకుంది. పాటలో ఆమె లీనమైన తీరు చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీలో ఈ టాలెంట్‌ కూడా ఉందా అంటూ నెటిజన్లు షాకవుతున్నారు. ప్రస్తుతం నివేదా పాడిన ఈ పాట నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుధీర్‌ వర్మ డైరెక్షన్‌లో ‘శాకిని ఢాకిని’ అనే మూవీలో నటిస్తుంది.  ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ అనే కొరియన్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్ర మరొక హీరోయిన్‌గా నటిస్తుంది. 

చదవండి : హీరోయిన్‌ను ఆ విషయం గురించి డైరెక్ట్‌గా అడిగేసిన నెటిజన్‌
మోనాల్‌ని అఖిల్‌ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా?

మరిన్ని వార్తలు