ఒక రోజు ముందే ఒరేయ్ బుజ్జిగా రిలీజ్‌

30 Sep, 2020 17:09 IST|Sakshi

హీరో రాజ్ త‌రుణ్‌, హీరోయిన్ మాళ‌వికా నాయ‌ర్ జంట‌గా న‌టించిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా.'. విజ‌య‌కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో కేకే రాధ‌మోహ‌న్ నిర్మించిన ఈ సినిమాను మార్చి 25న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ థియేట‌ర్లు మూత ప‌డ‌టంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. థియేట‌ర్లు ఓపెన్ చేశాక రిలీజ్ చేద్దామ‌నుకున్నారు. అయితే పెద్ద సినిమాలే ఓటీటీ బాట ప‌ట్టిన త‌రుణంలో ఒరేయ్ బుజ్జిగా కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఆశ్ర‌యించింది. అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. (చ‌ద‌వండి: నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మార్వలెస్ లవ్ స్టోరీ)

కానీ అదే రోజు అగ్ర‌తార అనుష్క న‌టించిన "నిశ్శ‌బ్ధం" సినిమా కూడా ప్రేక్ష‌కుల ముందుకు వస్తోంది. దీంతో ఒక‌రోజు ముందుగానే రిలీ‌జ్ చేయాల‌న్న ప్రేక్ష‌కుల కోరిక మేర‌కు 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రాన్ని అక్టోబ‌ర్ 1న విడుద‌ల చేస్తున్న‌ట్లు రాజ్ త‌రుణ్ ప్ర‌క‌టించారు. అయితే ఈ నిర్ణ‌యాన్ని అత‌డు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ‌హిరంగంగా ప్ర‌క‌టించేంత‌వ‌ర‌కు నిర్మాత‌కు కూడా తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అనంత‌రం ఇదే విష‌యాన్ని అభిమానుల‌కు తెలుపుతూ ట్విట‌ర్‌లో పోస్ట్ పెట్టారు. స‌ర్‌ప్రైజ్‌.. రేపు సాయంత్రం ఆరు గంట‌ల‌కే సినిమా చూసేయండ‌ని చెప్పుకొచ్చారు. రెండున్న‌ర గంటలు న‌వ్వుతూనే ఉంటారు అని హామీ ఇస్తున్న ఈ చిత్రం  ప్రేక్ష‌కుల‌ను ఏమేర‌కు మెప్పిస్తుందో చూడాలి. (చ‌ద‌వండి: హైకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు, అశ్వనీదత్‌)

మరిన్ని వార్తలు