పైడి జయరాజ్‌ సేవలు మరువలేనివి

29 Sep, 2020 02:16 IST|Sakshi
జైహింద్‌ గౌడ్, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, శ్రావణ్‌ కుమార్‌ గౌడ్‌ తదితరులు

– మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

‘‘తెలంగాణ ముద్దుబిడ్డ, తొలి తరం ఇండియన్‌ సూపర్‌ స్టార్, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుగ్రహీత పైడి జయరాజ్‌ భారతీయ సినిమాకు అందించిన సేవలు మరువలేనివి. ఆయన పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మరింత మారుమ్రోగేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. పైడి జయరాజ్‌ 111వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌లో ‘జై తెలంగాణ ఫిల్మ్‌ జేఏసీ’ చైర్మన్‌ పంజాల జైహింద్‌ గౌడ్‌ సారధ్యంలో జరిగాయి.

ఈ సందర్భంగా పంజాల జైహింద్‌ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ లో సినిమా పరిశ్రమకు ఇచ్చే అవార్డులు పైడి జయరాజ్‌ పేరిట ఇవ్వాలి. అంతేకాకుండా హైదరాబాద్‌–కరీంనగర్‌ హైవేకి పైడి జయరాజ్‌ హైవేగా నామకరణం చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్‌.వి. సుభాష్, ఎం.ఎల్‌.సి. నారపురాజు రామచంద్రరావు, నటుడు బాబూమోహన్, ‘తెలుగు నిర్మాతల మండలి’ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ‘ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’ అధ్యక్షులు మోహన్‌ గౌడ్, హీరో పంజాల శ్రావణ్‌ కుమార్‌ గౌడ్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు