Paruchuri Gopala Krishna: అప్పటి దర్శకులు చేయలేని సాహసం చేశారు: పరుచూరి

21 May, 2023 21:16 IST|Sakshi

నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేశ్ జంటగా నటించిన ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమా విజయం పట్ల ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నాని నటన అత్యద్భుతంగా ఉందని ప్రశంసించారు. 

(ఇది చదవండి: లక్షన్నరలో హీరోయిన్‌ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!)

పరుచూరి మాట్లాడుతూ.. ' ఈ సినిమా పూర్తిగా నాని- కీర్తి సురేశ్‌దే. ప్రారంభం నుంచి చివరి వరకూ తన నటనతో ఆశ్చర్యానికి గురిచేశాడు నాని. సాధారణంగా క్యూట్‌ లుక్‌లో ఉండే నాని ఈ చిత్రంలో ఊర మాస్‌ లుక్‌లో కనిపించాడు. అందుకే ఈ సినిమా విషయంలో ముందు నానినే మెచ్చుకోవాలి. అలాగే హీరో మిత్రుడిగా దీక్షిత్‌ శెట్టి అదరగొట్టాడు. ఈ చిత్రంలో అంతర్లీనంగా రామాయణం - మహాభారతం కథలు కనిపించాయి. విలన్‌ ఒక రావణాసురుడి లాంటి వాడు. అందుకే అతడిని చంపేటప్పుడు రావణకాష్ఠం చూపించారు. సాయికుమార్‌ పాత్ర చిన్నదే అయినప్పటికీ క్లైమాక్స్‌లో డైలాగ్‌ విని.. ఇతడే విలనా? అ‍న్న సందేహం కూడా ప్రేక్షకులకు వస్తుంది. అలాంటి ఎలిమెంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ను దర్శకుడు శ్రీకాంత్ క్రియేట్‌ చేశాడు.

ఇందులో మరో విచిత్రం ఏమిటంటే.. క్లైమాక్స్‌లో హీరోని అంతం చేయడానికి ఎంతోమంది రౌడీలు వస్తారు. ఆ సమయంలో గ్రామస్థులెవరూ హీరోకు సపోర్ట్‌ చేయరు. సమాజంలో ఒక వ్యక్తికి భయపడి పేద ప్రజలు ఎలా బతుకుతారో? చెప్పడానికి ఈ సినిమానే ఓ నిదర్శనం. నాకు తెలిసినంతవరకూ ఏదో ఒక గ్రామాన్ని చూసి స్ఫూర్తి పొందే వాళ్లు ఇలాంటి సీన్స్‌ తీశారు. ఆ గ్రామంలో పెత్తందారు చెప్పిందే అక్కడి ప్రజలు వినాలి అనే రూల్స్‌ ఉంటాయి.

(ఇది చదవండి: ప్యాలెస్‌లో శర్వానంద్‌ పెళ్లి.. ఒక్క రోజుకు ఎన్ని కోట్ల ఖర్చంటే?)

పరుచూరి మాట్లాడుతూ.. 'చిన్నప్పుడు ధరణిపై ఇష్టంగా ఉన్న అమ్మాయి.. ఆ తర్వాత వేరొకరితో పెళ్లి జరుగుతుంది. సూరి (దీక్షిత్‌ శెట్టి) చనిపోయిన తర్వాత వెన్నెల (కీర్తిసురేశ్‌)ను వితంతువును చేస్తుంటే.. ధరణి (నాని) అక్కడికి వెళ్లి అదే తాళిని ఆమె మెడలో కడతాడు. అదే ఈ సినిమాలో అద్భుతమైన షాట్.  అప్పటి దర్శకులు చేయలేని ధైర్యం ఇ‍ప్పుడున్న వాళ్లు చేశారనడానికి నిదర్శనం. విలన్ చనిపోయాక కూడా సినిమా నడుస్తుంది. ధరణి ప్రేమను వెన్నెల ఒప్పుకుందా? అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు. చివర్లో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ప్రేక్షకుల ఉత్కంఠకు తెరదించాడు. నాని జీవితంలో ఇది మరిచిపోలేని చిత్రంగా నిలిచింది. అసలు అక్కడ ఉన్నది నానినేనా అనే సందేహం కలుగుతుంది.' అంటూ ప్రశంసించారు. 


 

మరిన్ని వార్తలు