పవన్‌ సినిమాతో ఫుల్‌ బిజీ అయిపోయిన క్రిష్‌

12 Jan, 2021 19:54 IST|Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ మూవీ షూటింగ్‌ గతేడాది డిసెంబర్‌లో పూర్తిచేసుకుంది. పవన్‌ తదుపరి 27వ సినిమాను దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ను‌ ప్రారంభిస్తున్నట్లు మంగళవారం క్రిష్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఇప్పటికే సెట్స్‌పైకి రావాల్సిన ఈ సినిమా.. డైరెక్టర్‌ క్రిష్‌కు కరోనా సోకడంతో వాయిదా పడింది. ఇక ఆయన కరోనా నుంచి కోలుకోవడం, ‘వకీల్‌ సాబ్’‌ షూటింగ్‌ కూడా పూర్తి చేసుకోవడంతో సోమవారం షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ లోకేషన్‌కు సంబంధించిన ఫొటోలను దర్శకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. (చదవండి: 'వకీల్ సాబ్' టీజర్ టైమ్ ఫిక్స్)

‘పీఎస్‌పీకే27’ అంటూ షూటింగ్‌ సెట్స్‌లో బిజీగా ఉన్న ఫొటోలను క్రిష్‌ షేర్‌‌ చేశారు. పిరియాడికల్‌ డ్రాప్‌లో రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ‘విరుపాక్ష’ పేరుతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటి రావాల్సి ఉంది. కాగా పవన్‌ ఈ సినిమాతో పాటు సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే సమయంలో షూటింగ్‌ను‌ జరుపుకోనున్నాయంటూ టాలీవుడ్‌ వర్గాల నుంచి సమచారం. అయితే దీనిపై మాత్రం ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. పవన్‌ కల్యాణ్‌ అటూ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇటూ సినిమాల రీ ఎంట్రీలో స్పీడ్‌ పెంచడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: పవన్‌ కల్యాణ్‌‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన దివి?)

A post shared by Krish Jagarlamudi (@director_krish)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు