ఇది మహిళల కోసం నిలబడే సమయం: పాయల్‌

21 Sep, 2020 15:44 IST|Sakshi

ముంబై: ‘ఇప్పుడు మహిళల కోసం నిలబడాల్సిన సమయం, ప్లీజ్‌ వారి వాదన వినండి’ అంటూ నటి పాయల్‌ ఘోష్‌ ప్రజలను కోరారు. అంతేగాక దర్శక-నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌పై వల్ల తనకు ప్రమాదం ఉందని, సాయం చేయాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆమె తాజాగా‌ ట్విట్‌ చేశారు. అనురాగ్‌ తనను బలవంతం చేయబోయాడని అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పాయల్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్వీట్‌ చేశారు. ‘‘అనురాగ్‌ నన్ను లైంగికంగా ఇబ్బందికి గురిచేశాడు. దయతో అతడిపై చర్య తీసుకోండి. ఈ సృజనాత్మక వ్యక్తి వెనుక రాక్షసుడు ఉన్నాడు. అది ప్రజలంతా గ్రహించాలి. దయ చేసి నాకు సాయం చేయండి’’ అంటూ ఆమె ట్విటర్‌ వేదికగా మోదీకి విజ్ఞప్తి చేశారు. అయితే అనురాగ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన అనంతరం చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు, నటీనటులు పాయల్‌వి అసత్య ఆరోపణలని, అలాంటి వాడు కాదంటూ ఆయనకు మద్దతునిస్తున్న విషయం తెలిసిందే.
(చదవండి: కశ్యప్‌పై పాయల్‌ లైంగిక దాడి ఆరోపణలు)

(చదవండి: నేనెప్పుడూ అలా ప్ర‌వ‌ర్తించ‌లేదు: అనురాగ్‌)

మరిన్ని వార్తలు