పెళ్లి సందడి@25.. రాఘ‌వేంద్ర‌రావు ఎమోషనల్‌ ట్వీట్‌

12 Jan, 2021 14:14 IST|Sakshi

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన సూపర్ హిట్ సినిమా సినిమాల్లో ‘పెళ్లి సంద‌డి’ ఒకటి. ఈ చిత్రంలోని పాటలు ఎంత పాపులర్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సౌందర్య లహరి.. స్వప్న సుందరి’, ‘నవ మన్మథుడా.. అంతి సుందరుడా’, ‘హృదమనే కోవల తలుపులు తెరిచే తాళం ప్రేమ’ లాంటి పాటలు వింటే ఇప్పటికీ  ఏదో అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్‌, రవళి, దీప్తి భట్నాగర్‌ హీరోయిన్లుగా  అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌ నిర్మించిన  ఈ సినిమా జ‌న‌వ‌రి 12,1996లో విడుద‌లైంది. బుధవారం నాటికి ఈ చిత్రం 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా రాఘవేంద్ర‌ర‌రావు ట్విట్ట‌ర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 
 

‘పెళ్లిసందడి. నేటికి సినిమా విడదల అయ్యి 25 ఏళ్ళు అయింది. నా కెరీర్ లో, శ్రీకాంత్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణి కి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్ లకు నమస్కరిస్తున్నాను’ అని రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు. 

అలాగే ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పెళ్లి సందD సినిమా హీరోయిన్‌ పేరును తెలియజేస్తూ మరో ట్వీట్‌ చేశారు. ఈ పాతికేళ్ల పెళ్లిసందడి సంబరాలను రెట్టింపు చేయడానికి పెళ్లిసందD సినిమా ని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీల తో చేస్తున్నాము.. నా దర్శకత్వ పర్యవేక్షణ లో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం... త్వరలో థియేటర్లో కలుద్దాం. అని ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. కాగా అమెరికాలో పుట్టి పెరిగిన శ్రీ లీల.. కిస్ అనే క‌న్న‌డ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ విడుద‌ల అవ్వ‌కుండానే శ్రీముర‌ళి న‌టిస్తోన్న భార‌తే అనే మూవీలో అవ‌కాశం సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పెళ్లిసందDతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు