Lokesh Kanagaraj: లియో డైరెక్టర్‌పై ఫిర్యాదు.. మానసిక రోగి అంటూ!

3 Jan, 2024 19:15 IST|Sakshi

లియో మూవీతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. లియో తర్వాత లోకేశ్‌ తదుపరి చిత్రాన్ని సూపర్‌స్టార్‌ తలైవాతో చేయనున్నారు. ప్రస్తుతం ఆ మూవీ స్క్రిప్ట్‌ తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. 

(ఇది చదవండి: OTT Releases This Week: ఈ వీకెండ్‌ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!)

ఇదిలా ఉండగా.. తాజాగా లోకేశ్ కనగరాజ్‌పై ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. ఆయనకు మానసిక పరీక్షలు చేయాలని కోరుతూ మధురై హైకోర్టు బెంచ్‌లో మదురైకి చెందిన రాజు మురుగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రంలో హింసాత్మక కంటెంట్ ఉన్నందున లియోని నిషేధించాలని.. అంతే కాకుండా కనగరాజ్‌కు మానసికంగా పరీక్షలు నిర్వహించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

లియో చిత్రంలో హింసను ప్రేరేపించేలా సన్నివేశాలు ఉన్నాయని పిటిషనర్‌ కోర్టుకు వివరించారు. ఆయుధాల వినియోగం, మతపరమైన చిహ్నాలు, మాదకద్రవ్యాల వినియోగం, మహిళలు, పిల్లలపై హింస లాంటి సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్ ప్రస్తావించారు. లియో చిత్రంపై పూర్తిగా నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ కేసును కనగరాజ్‌ న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో వాయిదా వేశారు.

(ఇది చదవండి: ఆ నటుడు పిచ్చోడిలా ప్రవర్తించాడు.. అందరూ పారిపోయారు!)

>
మరిన్ని వార్తలు