'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నుంచి బ్యూటిఫుల్‌ మెలోడి సాంగ్‌ రిలీజ్‌

10 Mar, 2023 15:13 IST|Sakshi

నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీనివాస్‌ అవసరాల కథ, స్క్రీన్‌ ప్లే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈనెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌ జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమాలోని లిరికల్‌ సాంగ్స్‌ని రిలీజ్‌ చేస్తోంది. తాజాగా ‘నీతో ఈ గడిచిన కాలం .. నడిచిన దూరం ఎంతో ఇష్టం’ అంటూ సాగే మెలోడి పాటను విడుదల చేశారు. గీతా మాధురి ఆలపించిన ఈ సాంగ్‌ అలరిస్తుంది. 


 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు