పోకిరి మూవీకి 15 ఏళ్లు.. నమ్రత కామెంట్‌..

28 Apr, 2021 17:16 IST|Sakshi

నేటితో పోకిరి చిత్రానికి 15 ఏళ్లు..

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాస్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘పోకిరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేటికి ఈ సినిమాను మర్చిపోని వారు లేరు. పోకిరిలోని కొన్ని పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ ఇప్పటికి వినబడుతూనే ఉంటాయి. ఇక ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతుందో ఆడే పండుగాడు, ‘ఎప్పుడు వచ్చావని కాదన్నయా.. బుల్లెట్‌ దిగిందా లేదా?’ అనే డైలాగ్స్‌ ఎంత పాపులరయ్యాయో అందరికి తెలిసిందే. టాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ‘పోకిరి’ చిత్రం విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) 15 ఏళ్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా మహేశ్‌ భార్య నమ్రత శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో పండు ఫొటోను షేర్‌ చేస్తూ తన స్పందనను తెలిపారు. ‘;పోకిరి ఒక సంచలనాత్మక చిత్రం. క్లాస్‌, మాస్‌ వంటి సంపూర్ణ మిశ్రమ చిత్రం. పండుగా మహేశ్‌ జీవితకాలం గుర్తుండిపోయే అద్భుతమైన చిత్రం’ అంటూ రాసుకొచ్చారు. కాగా పోకిరి మూవీని కోరియోగ్రఫర్‌, దర్శకుడు, ప్రభుదేవ హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో ‘వాంటెడ్‌’ పేరుతో రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో ‘పోక్కిరి’గా కూడా రీమేక్‌ అయ్యింది. ఇందులో మహేశ్‌ పాత్రలో తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ నటించాడు. కాగా ప్రస్తుతం మహేశ్‌ ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.  

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు