బుట్టబొమ్మ పారితోషికం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

8 Jul, 2021 08:21 IST|Sakshi

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోయింది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో ఇచ్చిన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పుతుంది. ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్‌ చేసింది. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్నవి దాదాపు పాన్‌ ఇండియా సినిమాలే. దీంతో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని రెమ్యునరేషన్‌ కూడా భారీగా పెంచేసిందట. ప్రస్తుతం నితిన్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న ఓ సినిమాకు పూజా సైన్‌ చేసినట్లు సమాచారం.

ఈ మూవీకి గాను ఏకంగా రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్‌ అడిగిందట. ఇందుకు నిర్మాతలు కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే దక్షిణాదిన భారీ రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోయిన్ల లిస్ట్‌లోకి పూజా హెగ్డే కూడా చేరిపోయింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య, ప్రభాస్‌తో రాధే శ్యామ్‌ పాన్‌ ఇండియా చిత్రాలతో పాటు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ సినిమాలోనూ నటిస్తుంది. ఇవి కాకుండా తమిళంలో విజయ్‌తో బీస్ట్‌, బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌తో ‘కభీ ఈద్‌...  కభీ దీవాలి’ చిత్రంలోనూ నటిస్తుంది. చూస్తుంటే మరో రెండేళ్ల పాటు బుట్టబొమ్మ డేట్స్‌ ఫుల్‌ బిజీగా ఉన్నట్లున్నాయి. 

మరిన్ని వార్తలు