Salaar Fourth Day Collections: బాక్సాఫీస్ వద్ద సలార్ జోరు.. నాలుగు రోజుల్లోనే మైల్‌స్టోన్!

26 Dec, 2023 21:18 IST|Sakshi

ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే రూ.402 కోట్లు రాబట్టిన ఈ చిత్రం నాలుగు రోజు కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే సోమవారంతో కలిపి రూ.450 కోట్ల వసూళ్లు దాటినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదే జోరు కొనసాగితే ఐదు రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

తొలి నాలుగు రోజుల్లోనే కేవలం ఇండియా వ్యాప్తంగా రూ.250 కోట్ల కలెక్షన్ల మార్కును దాటడం మరో విశేషం. ఈ చిత్రం ఇండియా బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.255.40 కోట్లు కొల్లగొట్టింది. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.76.91 కోట్లు వసూళ్లు రాగా.. ఇండియాలోనే రూ.45.77 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదేవిధంగా కలెక్షన్స్ జోరు కొనసాగితే ఐదు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది.

తొలిరోజు రూ.178.7 కోట్లు రాగా.. రెండో రోజుకే రూ.295.7 కోట్లకు చేరుకున్న వసూళ్లు.. మూడో రోజే నాలుగు వందల మార్క్‌ను దాటేశాయి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకపాత్రల్లో నటించారు. 

>
మరిన్ని వార్తలు