-
Salaar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అయిన సలార్.. ట్రైలర్ అదిరింది!
జపాన్‌లో ఇండియన్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అక్కడ భారతీయ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో పాటు కేజీయఫ్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు కూడా జపాన్‌లో రిలీజై మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా మరో ఇండియన్ చిత్రం జపాన్‌లో రిలీజ్ కాబోతుంది. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’. కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో ప్రభాస్‌కి ఓ మంచి హిట్ లభించింది. థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు ప్రభాస్. జులై 5న ఈ చిత్రాన్ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం యాక్షన్ సీన్లతోనే కట్ చేసిన ఈ ట్రైలర్ గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో శృతీహాసన్ హీరోయిన్గా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. -
'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
డార్లింగ్ ప్రభాస్‌కి 'సలార్' స్పెషల్ మూవీ. ఎందుకంటే 'బాహుబలి' తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న ఇతడికి.. ఈ మూవీ సక్సెస్ సరికొత్త ఎనర్జీ ఇచ్చింది. గతేడాది థియేటర్లలో రిలీజైనప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. కొన్నిరోజుల క్రితం టీవీలో వచ్చినప్పుడు మాత్రం ఊహించనంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్)ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన సినిమా 'సలార్'. 'కేజీఎఫ్' తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన ఈ మూవీ.. చాలాసార్లు వాయిదాలు పడుతూ గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని, రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బిగ్ స్క్రీన్‌పై సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. బుల్లితెరపై మాత్రం ఫెయిలైంది. ఏప్రిల్ 21న ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారం చేయగా కేవలం 6.52 టీఆర్పీ వచ్చింది. తాజాగా ఈ విషయం బయటపడింది.థియేటర్లలో 'సలార్'ని బాగానే చూశారు. కానీ టీవీల్లోకి వచ్చేసరికి దీన్ని లైట్ తీసుకున్నారు. ఎందుకంటే థియేటర్లలో ఫ్లాప్ అయిన ఆదికేశ (10.47), స్కంద (8.11)తో పాటు ఓ మాదిరిగి ఆడిన నా సామి రంగ (8.08), మంగళవారం (7.21), బిచ్చగాడు 2 (7.12) చిత్రాలకు కూడా 'సలార్' కంటే ఎక్కువ టీఆర్పీ రావడం అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ హవా నడుస్తోంది. దీని వల్ల టీఆర్పీ తగ్గిందని తెలుస్తోంది. లేదంటే ఎక్కువ వచ్చేదేమో?(ఇదీ చదవండి: ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్) -
‘సలార్’ ఆల్ సెట్... గో
‘సలార్’ సెట్స్‌లోకి తిరిగి జాయిన్ అయ్యేందుకు ప్రభాస్ సై అన్నారట. హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రంలోని తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ‘సలార్’లోని మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’ చిత్రీకరణను వెంటనే మొదలు పెట్టాలని ప్రభాస్, ప్రశాంత్ నీల్ భావించారు.కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను ప్రశాంత్ నీల్ పూర్తి చేశారట. ఇక ఆల్ సెట్... గో అంటూ షూటింగ్‌ను ఈ నెల చివరి వారంలో హైదరాబాద్‌లో మొదలు పెట్టనున్నారని సమాచారం. ఓ పది రోజుల పాటు షూటింగ్ జరిపి, ఆ తర్వాత బెంగళూరులో చిత్రీకరణను ప్లాన్ చేశారట, వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేసి, కుదిరితే ఈ ఏడాది చివర్లోనే క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా.జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, బాబీ సింహా, శ్రుతీహాసన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రం జపాన్‌లో జూలైలో విడుదల కానుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు జపాన్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో ‘సలార్: సీజ్ఫైర్’ సినిమాను కూడా జపాన్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. -
ఒక్క మెసేజ్‌తో 'సలార్' బైక్‌ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సలార్. గత ఏడాది డిసెంబరులో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. కొద్దిరోజుల క్రితమే బుల్లితెరపై కూడా సందడి చేసింది. ఈ క్రమంలో సినిమా చూస్తూ సలార్ బైక్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని స్టార్ మా వారు అవకాశం కల్పించారు. తాజాగా విన్నర్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోన్ స్టార్ మా షేర్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 700 కోట్లకుపైగానే కలెక్ట్ చేసిన ‘సలార్’ రెండో భాగం ‘శౌర్యంగపర్వం’ పనులను ఆరంభించారు ప్రశాంత్ నీల్. ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి కావస్తుండటంతో కొద్దిరోజుల్లో షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని తెలిసింది.సినిమా థియేటర్లు, ఓటీటీలో సందడి చేసిన సలార్ మూవీ ఏప్రిల్ 21న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూస్తూ బైక్‌ను గెలుచుకోవచ్చని హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. ఏ విధంగా సలార్ బైక్‌ను సొంతం చేసుకోవాలో కూడా హోంబలె ఫిలిమ్స్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. విజయవాడకు చెందిన వరప్రసాద్ అనే వ్యక్తి సలార్ బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ వివరాలను వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు.ఏప్రిల్ 21న సలార్ సినిమాను చూస్తున్న సమయంలో స్క్రీన్ పై ఒకవైపు బైకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో బైక్ ఎన్ని సార్లు స్క్రీన్ మీద కనిపించిందో ప్రేక్షకులు లెక్కబెట్టాలని ఆ వెంటనే 9222211199 నంబర్‌కు SALAAR అని టైప్ చేసి పంపించాలని మేకర్స్ కోరారు. ఈ ఎస్సెమ్మెస్‌లను డిప్ ద్వారా ఎంపిక చేస్తామని ఆ సమయంలో ప్రకటించింది. వారు చెప్పినట్లుగానే సలార్ బైక్‌ను విజేత వరప్రసాద్‌కు అందచేశారు. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
క్రేజీ గాసిప్.. ప్రశాంత్ నీల్‌తో విజయ్ దేవరకొండ సినిమా?
లైగర్ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అయిపోయేవాడు. ఆ చిత్రం ప్లాప్ అయినప్పటికీ విజయ్ క్రేజీ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు కానీ పాన్ ఇండియా రేస్‌లో కాస్త వెనుకబడ్డాడు. ఒకే ఒక్క హిట్ వస్తే చాలు విజయ్‌తో సినిమా చేయడానికి కరణ్ జోహార్ మొదలు.. పాన్ ఇండియా దర్శకనిర్మాతలంతా రెడీగా ఉన్నారు.కానీ విజయ్ బ్యాడ్ లక్ ఏంటంటే.. ఆయన నటించిన సినిమాలన్నింటికి మంచి పేరు వస్తుంది కానీ బాక్సాపీస్ వద్ద బోల్తా పడుతుంది. ఖుషి, ఫ్యామిలీ స్టార్.. రెండు మంచి చిత్రాలే కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పడు విజయ్ దృష్టి అంతా గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ పైనే ఉంది. ఈ చిత్రంలో ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు రౌడీ హీరో. గౌతమ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్.. విజయ్‌ని కలిశాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉండబోతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ కోసం ప్రశాంత్ ఓ కథ రెడీ చేశారట. ఇటీవల హైదరాబాద్‌కి వచ్చి విజయ్‌కి కథ వినిపించాడట. మరి ఆ కథేంటి? వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందా లేదా? అనేది త్వరలో తెలుస్తుంది. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా ఉన్నప్పటికీ.. అది ఇప్పట్లో పట్టాలెక్కే చాన్స్ లేదు. ప్రశాంత్ ప్రస్తుతం సలార్ 2 ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు విడుదలైన తర్వాతే ప్రశాంత్ మరో ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తారు. సలార్ 2లో విజయ్ దేవరకొండ?ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం సలార్. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా సలార్ శౌర్యంగపర్వం’ రూపుదిద్దుకోనుంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాని కోసమే హైదరాబాద్‌కి వచ్చి విజయ్‌ని కలిశాడట ప్రశాంత్. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ ఈ క్రేజీ న్యూస్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
చంద్రబాబు వల్లే అన్యాయం
గుడాల గోపికి అడుగడుగునా బ్రహ్మరథం
వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయం
జనసేన, టీడీపీకి రాంరాం
సంక్షేమం సగం బలం
సమస్యలపై నాన్చడం నచ్చదు..
చెల్లెం ఆనందప్రకాష్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు
ముస్లింలకు అండగా జగన్
చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్‌తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement