Prabhu Deva: ప్రభుదేవా సినిమాలో హీరోయిన్‌ పాత్రే ఉండదట!

18 Feb, 2022 09:14 IST|Sakshi

డాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ముసాషీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవల నటనపైనే దృష్టి సారి స్తున్న ఈయన వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. నవ దర్శకుడు శ్యామ్‌ రోట్రిగ్స్‌ దర్శకత్వంలో జాయ్‌ ఫిలిం బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జాన్‌ బ్రిట్టో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పోలీసు అధికారిగా నటిస్తున్నారు.

హీరోయిన్‌ లేని ఈ చిత్రంలో జాన్‌ విజయ్, వీటీవీ గణేష్, జార్జ్‌ మరియాన్, మలయాళ నటుడు బినూపప్పు అరుళ్‌ దాస్, మాస్టర్‌ మహేంద్రన్‌ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. దీనికి ఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సంగీతాన్ని, విఘ్నేష్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను గురువారం దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ప్రభుదేవా మాస్‌ గెటప్‌తో కూడిన ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు