అల్లు అర్జున్‌కు నో చెప్పడమా?: ప్రియా వారియర్‌

26 Feb, 2021 16:04 IST|Sakshi

కొంటెగా కన్ను గీటిన వీడియోతో యావత్‌ దేశాన్ని తనవైపు తిప్పుకుంది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. 'ఒరు ఆడార్‌ లవ్‌' సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నా ఆమెకు మాత్రం మంచి పేరు వచ్చింది. తర్వాత ఓ హిందీ మ్యూజిక్‌ వీడియోలోనూ నటించి, ఆ పాటను ఆలపించిందామె. తాజాగా ఈ కేరళ కుట్టి 'చెక్‌' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 26న) రిలీజైంది. ఇదిలా వుంటే ఆమెకు నితిన్‌తో కన్నా ముందు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాలో నటించే గోల్డెన్‌ ఛాన్స్‌ వచ్చిందన్న వార్తలు వినిపించాయి. పైగా ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు కూడా గాసిప్స్‌ వచ్చాయి. తాజాగా ఈ రూమర్లపై ప్రియా వారియర్‌ క్లారిటీ ఇచ్చింది.

"నాకు అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం. మలయాళంలో ఆయన సినిమాలు డబ్‌ చేసేవాళ్లు. చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ పెరిగాను. నాకు ఆయన సినిమాలో అవకాశం వచ్చిందని, కానీ నేను దాన్ని చేజేతులా వదిలేసుకున్నట్లు వచ్చిన వార్తలు నాదాకా వచ్చాయి. కానీ అవి వట్టి పుకార్లు మాత్రమే. బన్నీ అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది. అలాంటిది ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకుంటానా! తప్పకుండా నటించి తీరుతాను" అని ప్రియా చెప్పుకొచ్చింది. 

చదవండి: రూటు మార్చిన ‘కన్ను గీటు’ భామ

న్యూడ్‌ ఫోటో అడిగిన నెటిజన్‌..షేర్‌ చేసిన యాంకర్‌

చెక్‌ మూవీ రివ్యూ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు