సూర్యతో క్రేజీ ఛాన్స్‌ కొట్టేసిన శ్రీకారం నటి!

22 Jan, 2021 00:42 IST|Sakshi

‘గ్యాంగ్‌ లీడర్‌’ భామ ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ క్రేజీ ఛాన్స్‌ కొట్టేశారని కోలీవుడ్‌ టాక్‌. సూర్యతో జోడీ కట్టే అవకాశం ప్రియాంక కొట్టేశారన్నది ఆ వార్త. పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్‌ అయ్యారు సూర్య. ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమట. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ను కథానాయికగా అనుకుంటున్నారట. ఫిబ్రవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. శివ కార్తికేయన్‌తో ‘డాక్టర్‌’ అనే సినిమా చేశారు ప్రియాంక. ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రెండో సినిమాకే సూర్యతో జోడీ అంటే  క్రేజీ ఛాన్స్‌ అనాల్సిందే. ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్‌తో ‘శ్రీకారం’ సినిమాలో నటిస్తున్నారు.
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు