భారీ యాక్షన్‌ ప్లాన్‌తో ‘ప్రాజెక్ట్‌ కె’!

16 Sep, 2022 05:01 IST|Sakshi
ప్రభాస్‌ 

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రానికి సంబంధించి ఓ వార్త ప్రచారంలోకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో ఐదు భారీ యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఉంటాయట. మూడో ప్రపంచం యుద్ధం నేపథ్యంలో ఈ సుదీర్ఘ యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఉంటాయని సమాచారం. ఇందుకోసం హాలీవుడ్‌కి చెందిన ఐదుగురు ఫైట్‌ మాస్టర్స్‌ని నియమించారట.

ఒక్కో యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ ఒక్కో ఫైట్‌ మాస్టర్‌ ఆధ్వర్యంలో జరుగుతుందని టాక్‌. అలాగే ‘అవెంజర్స్‌’, ‘గాడ్జిల్లా’, ‘కింగ్‌ కాంగ్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు ఉపయోగించిన కెమెరాలను ఈ చిత్రానికి వాడుతున్నారట. ఇక ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకోన్‌ కథానాయికగా నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు