పచ్చ మందలో 'కొత్త పిట్ట' పలుకులు.. పైసాకి పనికిరాని పృథ్వీరాజ్

25 Dec, 2023 12:52 IST|Sakshi

ఏపీలో రాజకీయ పార్టీలు అన్నీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున లెక్కకు మించిన సర్వేలు బయటకు వస్తుంటాయి. దేశంలో ప్రముఖంగా ఉన్న సర్వే సంస్థలు అన్నీ కూడా ఏపీలో వైసీపీని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని తేల్చేశాయ్‌.. 2024లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని సర్వే సంస్థలు క్లియర్‌గా తేల్చే చెప్పేశాయ్‌. అందులో భాగంగానే ఓట్ల కోసం పవన్‌ కల్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు తన లైన్‌లో పెట్టుకున్నాడు. అయినా, జగన్‌ను ఢీ కొట్టేందుకు బలం సరిపోవడంలేదని తేలిపోయింది. దీంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను కలిశాడు. అవసరమైతే రేపు కాంగ్రెస్‌ లేదా బీజేపీ మద్దతు కోసం కూడా ప్రయత్నాలు చేస్తాడు. ఇలా చంద్రబాబును ఎన్నికల సర్వేలన్నీ భయపెడుతున్నాయి.

ఫలితాలపై జోస్యం చెబుతున్న 'కొత్త పిట్ట'
తాజాగా ఇలాంటి సమయంలో కమెడియన్‌ పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాల ఫలితాలపై చిలుక జోస్యం చెప్పాడు. లగడపాటి రాజగోపాల్ వారసుడు మాదిరి 2024 ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి ఏపీలో విజయం సాధిస్తుందని చెప్పి కామెడీ చేశాడు. సీఎం జగన్‌ బలం ముందు కూటమి బలం సరిపోవడం లేదని చంద్రబాబు నానాపాట్లు పడి ప్రశాంత్‌ కిషోర్‌ సలహాల కోసం వెంపార్లుడుతుంటే మధ్యలో ఈ జోక్‌లు ఏంటి..? అని పృథ్వీరాజ్‌పై పంచ్‌లు పడుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఓటమి ఖాయం అని లగడపాటి రాజగోపాల్ అన్నారు.

దీంతో టీడీపీ శ్రేణులు ఆయన్ను ఆంధ్రా ఆక్టోపస్ అంటూ కీర్తించాయి.. తీరా ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సునామీ ముందు టీడీపీ నేతలు అందరూ కొట్టుకుపోయారు. ఆంధ్రా ఆక్టోపస్‌ సర్వేలను నమ్మి కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌ పెట్టి నష్టపోయిన వారు ఎందరో... ఫలితాలు వెలువడ్డాక సీఎం జగన్‌ దెబ్బ ఎలా ఉంటుందో లగడపాటి రాజగోపాల్‌కు తెలిసొచ్చింది. ఇకపై సర్వేలు చేయనని మూటముళ్లే సర్దుకొని కనిపించకుండా పోయాడు. తాజాగా లగడపాటి లేని లోటును కమెడియన్‌ పృథ్వీరాజ్ 2024 ఎన్నికల్లో తీర్చేలా ఉన్నాడు. ప్రస్తుతం టీడీపీలో పవన్‌కే సరైనే స్థానం లేదు.. వాళ్లను నమ్ముకుని ఇలాంటి చిలుక జోస్యాలు చెబితే ఎవరికైనా కామెడీగానే ఉంటుంది మరి!

న‌యా పైసా లాభం లేదు
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు పృథ్వీరాజ్ వైసీపీ కోసం పనిచేశాడు. పృథ్వీ వ‌ల్ల పార్టీకి న‌యా పైసా లాభం లేక‌పోయినా పదవి దక్కిందని అప్పట్లో సోషల్‌మీడియాలో కామెం‍ట్లు వచ్చాయి. అయినా కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చి పార్టీ కోసం పనిచేశాడని గుర్తించి.. అందుకుగాను ఎస్వీ భ‌క్తి ఛాన‌ల్ చైర్మ‌న్ బాధ్య‌త‌ల్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహన్‌ రెడ్డి అప్పట్లో అప్ప‌గించారు. అయితే ప్ర‌పంచ ప్ర‌సిద్ధి గాంచిన టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక చాన‌ల్ కీల‌క పోస్టులో ఉంటూ.. ఓ మ‌హిళ‌తో స‌ర‌స సంభాష‌ణ‌లు చేసి ప‌ద‌విని ఊడగొట్టుకున్నాడు. ఆ త‌ర్వాత క్ర‌మంగా వైసీపీకి దూర‌మ‌వుతూ.. టీడీపీ, జ‌న‌సేన‌ మందలో చేరిపోయాడు. తాజాగా ఈ కొత్త పిట్ట కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పడం విశేషం!

>
మరిన్ని వార్తలు