హీరోయిన్ జయప్రద అరెస్టు కోసం యూపీ పోలీసుల ప్రత్యేక బృందం

25 Dec, 2023 12:44 IST|Sakshi

ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ జయప్రద అరెస్ట్‌కి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? హీరోయిన్ కమ్ పొలిటిషన్ అయిన జయప్రద ఏం తప్పు చేసింది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్)

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్‌గా చేసిన జయప్రద.. 1994లో తెలుగుదేశం పార్టీలే చేరింది. కొన్నాళ్ల తర్వాత ఈ పార్టీని వీడి, సమాజ్ వాదీ పార్టీలో చేరింది. 2004 నుంచి 2014 వరకు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేసింది. 2019 నుంచి బీజేపీలో కొనసాగుతోంది. అయితే 2019లో ఎన్నికల సందర్భంగా జయప్రద.. నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో ఈమెపై నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ అయ్యాయి.

ఈ కేసులో భాగంగా కోర్టు సమన్లు జారీ చేసినా సరే విచారణ నిమిత్తం న్యాయస్థానం ఎదుట జయప్రద.. హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి, ఆమెని అరెస్ట్ చేయాలని ఉత్తరప్రదేశ్ పోలీసులని ఆదేశించింది. ఈ క్రమంలోనే మహిళా ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. ఇదంతా చూస్తుంటే జయప్రద అరెస్ట్ త్వరలో జరగడం గ్యారంటీ అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?)

>
మరిన్ని వార్తలు