-

Puppet Dance: డ్యాన్స్‌తో అదరగొట్టిన ఇద్దరమ్మాయిలు..

27 Nov, 2023 12:38 IST|Sakshi

తోలు బొమ్మలాట.. ప్రేక్షకుకు సినిమా పరిచయం లేని రోజుల్లో ఓ వెలుగు వెలిగింది. చాలా కథలను, పురాణ గాథలను తోలు బొమ్మలాటతో చెప్పేవారు. ఇందులో కళాకారులు బొమ్మలు ఆడిస్తూ పద్యాలు చెప్పేవారు. దీన్ని బొమ్మలాట నాటకం అంటారు. అచ్చంగా బొమ్మలు కదులుతున్నట్లుగా ఉండే నృత్యాన్ని పప్పెట్‌ డ్యాన్స్‌ అంటారు.

ఇందులో మనిషి ఎక్కడా వంపులు తిరగకుండా స్థిరంగా ఉండి, అక్కడక్కడా మెరుపులు చూపిస్తూ.. అచ్చంగా బొమ్మే కదులుతున్నట్లుగా డ్యాన్స్‌ చేస్తారు. తాజాగా ఓ పప్పెట్‌ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరు ఆడవాళ్లు హిందీ పాటకు అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. నిజంగానే వాళ్లు బొమ్మలా, రోబోలా నృత్యం చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ట్రోలింగ్‌తో ఆర్టిస్ట్‌ ఆత్మహత్య.. అదే చివరి సంభాషణ అంటూ విలపిస్తున్న తల్లి..

మరిన్ని వార్తలు