పుష్ప లో బిగ్ ట్విస్ట్ ప్లాన్ చేస్తున్న సుక్కు

30 Jul, 2021 17:41 IST|Sakshi

పుష్ప మూవీలో విలన్ ఎవరు? ఇంకెవరు మాలీవుడ్ యాక్టర్,ఫహాద్ ఫాజిల్ అంటారు కదా? కానీకాని సుకుమార్ అక్కడ.. ఆడియెన్స్ కు అంత ఈజీగా తన సినిమా అర్ధమైతే ఎలా... అందుకే పుష్ప లో బిగ్ ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నాడట. త్వరలో ఫుష్ప షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సింగిల్ షెడ్యూల్లో సినిమాను కంప్లీట్ చేసి,సాధ్యమైతే దసరా సీజన్కు తొలి భాగాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు సుకుమార్.

అల్లు అర్జున్ లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నాడు. బన్నీకి సవాల్ విసిరే పాత్రను మళయాల నటుడు ఫాహద్ ఫాజిల్ చేయబోతున్నాడు. అయితే ఇక్కడే ఒక్క ట్విస్ట్ ఉంది అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. పుష్పలో ఫాహద్ కాకుండా మరో నటుడు విలన్ రోల్ చేసి సర్ ప్రైజ్ చేయనున్నాడట.

టాలీవుడ్ టాప్ కమెడియన్ సునీల్ కూడా పుష్పలో కీరోల్ చేస్తున్నాడు. సునీల్ అనగానే ఒకప్పుడు కామెడీ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసేవారు. తర్వాత హీరోయిజం చూపిస్తే ఆశ్చర్యపోయారు. డిస్కో రాజా, కలర్ ఫోటో మూవీతో విలన్‌గా కూడా మారాడు. 

పుష్ప రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మెయిన్ విలన్ ఫాహద్ ఫాజిల్ ఎంట్రీ మాత్రం, సెకండ్ పార్ట్లో ఉంటుందనీ, ఫస్ట్పార్ట్లో మెయిన్ విలన్గా సునీల్ కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అదే నిజమైతే పుష్ప తో సునీల్ పాన్ ఇండియా రేంజ్ లో విలన్ కావడం ఖాయం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు