Pushpa Movie: ముంబైలో 'పుష్ప' ఫీవర్‌.. లోకల్‌ ట్రైన్‌లో శ్రీవల్లి హుక్ స్టెప్పు

17 Jan, 2022 20:31 IST|Sakshi

Pushpa Movie Allu Arjun Srivalli Song Hook Step In Mumbai Trains: జనాల్లో పుష్ప ఫీవర్‌ ఇంకా తగ్గినట్లు కనిపించడం లేదు. పుష్ప చిత్రాన్ని, అల్లు అర్జున్‌ మ్యానరిజాన్ని ఎవరికీ నచ్చినట్లు వారు వాడేస్తున్నారు. సినిమాలోని బన్ని యాక్టింగ్‌కు అశేషప్రేక్షక జనం ఫిదా అయ్యారు. అందులోని పాటలు మరింత హైలెట్‌ అయ్యాయి. సాంగ్స్‌ లిరికల్‌ వీడియోలు విడుదలైనప్పుడే వాటిని స్పూఫ్‌, కవర్స్‌లా తెగ వాడేశారు. ప్రస్తుతం వాణిజ్య సంస్థలు, హైదారబాద్‌ పోలీసులు సైతం పుష్పరాజ్‌ను బీభత్సంగా ఉపయోగించుకున్నారు. ఇటీవల శ్రీవల్లి సాంగ్‌ను మరాఠీ భాషలో రాసి మరీ పాట పాడాడు ఓ ట్రాఫిక్‌ పోలీసు. తాజాగా ఇదే పాటపై అల్లు అర్జున్‌ చేసిన డ్యాన్స్‌ను అనుకరిస్తూ వైరల్‌ అయ్యాడు ఒక ఇన్‌స్టా గ్రామ్‌ యూజర్. 

ముంబైకి చెందిన ధీరజ్‌ సనప్‌ శ్రీవల్లి పాటలోని అల్లు అర్జున్‌ హుక్‌ స్టెప్పును అనుకరిస్తూ వీడియో చేశాడు. ఆ స్టెప్పుతోనే ముంబై లోకల్‌ ట్రైన్‌లోకి వెళ్లడం, ప్రజల మధ్య తిరగడం, ఎస్కలేటర్‌ ఎక్కడం వంటివి చేస్తూ నవ్వు తెప్పిస్తున్నాడు. అల్లు అర్జున్‌ మ్యానరిజంతో హుక్‌ స్టెప్పు వేస్తే ధీరజ్‌ అదే స్టెప్పును సరదాగా అనుకరిస్తూ వీడియో చేసి నెట్టింట్లో వదిలాడు. ఇక ఇది చూసిన నెటిజన్స్‌ కామెంట్‌ రూపంలో మెచ్చుకుంటున్నారు. ఆదివారం అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియోకు ప్రస్తుతం లక్షకుపైగా వీక్షణలు వచ్చాయి. 
 

A post shared by Dhiraj sanap (@dhirajjjjj_)

ఇదీ చదవండి: హెల్మెట్‌తో 'పుష్ప'రాజ్.. అవగాహన కోసం పోలీసుల వాడకం

మరిన్ని వార్తలు