సిరీస్‌ కోసం సీరియస్‌

29 Dec, 2020 06:28 IST|Sakshi

వచ్చే ఏడాదిని చాలా సీరియస్‌గా స్టార్ట్‌ చేయనున్నారట బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌. జనవరి నెల ప్రారంభంలో ఆయన తాజా వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణ ఆరంభం కానుంది. రాజ్, డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సిరీస్‌ ఫుల్‌ యాక్షన్‌తో నిండి ఉంటుందట. ఇందులో షాహిద్‌ పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుందని సమాచారం. ఈ సిరీస్‌లో రాశీ ఖన్నా కథానాయికగా కనిపిస్తారు. అలానే తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ చిత్రీకరణను ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుపుతారు. ఏప్రిల్‌ కల్లా షూటింగ్‌ పూర్తవుతుందట. ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు షాహిద్‌. దీని తర్వాత కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో ‘యోధ’ అనే యాక్షన్‌ సినిమా కూడా కమిట్‌ అయ్యారు.

మరిన్ని వార్తలు