విజయ్‌ సినిమా: ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో రాశీ

20 Oct, 2020 12:52 IST|Sakshi

చెన్నై : గతేడాది వెంకీ మామ, ప్రతి రోజూ పండగే సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు నటి రాశీ ఖన్నా. ఆ తర్వాత ఏ ఏడాది(2020) నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌లో  బాక్సాఫీస్‌ వద్ద బొల్తా పడటంలో రేస్‌లో కొం‍చెం వెనకప్పడారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ ప్రాజెక్టుపై సైన్‌ చేయలేదు. ప్రస్తుతం రాశీ ఖన్నా తమిళంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు. అందేంటంటే.. కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘తుగ్లక్‌ స్టార్‌’. ఢిల్లీ ప్రసాద్‌ దీనాదయలన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఈ సినిమాలో అదితి రావ్‌ హైదరిని హీరోయిన్‌గా తీసుకున్నారు. తొలి షూటింగ్‌ అయ్యాక కరోనా లాక్‌డౌన్‌ రావడంతో సినిమాకు బ్రేక్‌ పడింది. దాంతో ఆమెకు డేట్స్‌ కుదరకపోవడంతో ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఇక తాజాగా అదితి స్థానంలో రాశీ ఖన్నా నటించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. చదవండి:విజయ్‌ సేతుపతి కూమర్తెకు అత్యాచార బెదిరింపు

ఈ మేరకు ట్విటర్‌లో చిత్ర యూనిట్‌ ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్యూ 7 స్రీన్‌ స్టూడియో. తుగక్లక్‌ సర్కార్‌లో భాగం అయినందుకు సంతోషంగా ఉంది.’ అని ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో రాశీ మార్వారీ అమ్మాయిగా నటించనున్నారు. ఇటీవల రాశీఖన్నాతో తొలి షూట్‌ చేయించారు. రాజకీయ నేపథ్యంలో సాగనుంది. డిసెంబర్‌ నాటికి పూర్తి చిత్రీకరణ జరిపేందుకు ఆలోచిస్తున్నారు. ఇక రాశీతోపాటు నటుడు పార్థిrబాన్‌, మంజిమా మోహన్‌, కరుణ కరన్‌, బాగవతి పెరుమాల్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా ‘తుగ్లక్‌ సర్కార్‌’ వీరిద్దరి కలయికలో రూపొందుతున్న రెండో సినిమా. ఇంతకుముందు విజయ్‌తో కలిసి రాశీ ‘సంగ తమిజాన్’ అనే సినిమా చేశారు. చదవండి: రాశీ ఖన్నా నోట.. ‘ఉండిపోరాదే’ పాట..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు